క్యూనెట్ కుంభకోణం: 70 మంది అరెస్టు.. 30 కేసులు నమోదు..

QNET: క్యూ నెట్ కుంభకోణంలో ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీసులు 70 మందిని అరెస్ట్ చేసి, 30 కేసులు నమోదు చేశారు.

news18-telugu
Updated: July 31, 2019, 7:23 PM IST
క్యూనెట్ కుంభకోణం: 70 మంది అరెస్టు.. 30 కేసులు నమోదు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
క్యూ నెట్ సంస్థ.. దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందిని మోసం చేసింది. ఐటీ కారిడార్లైన ముంబై, బెంగళూర్, నోయిడా, అహ్మదాబాద్ లాంటి అనేక నగరాల్లో క్యూనెట్ సంస్థ కోట్లు వసూలు చేసింది. యువత, ఉద్యోగులే టార్గెట్‌గా వారి వద్ద దాదాపు రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ క్యూ నెట్ కుంభకోణంలో ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీసులు 70 మందిని అరెస్ట్ చేసి, 30 కేసులు నమోదు చేశారు. క్యూ నెట్ బాధితులు దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఆ సంస్థ చేసిన మోసంతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. చైన్ మార్కెటింగ్ పేరుతో లక్షలాది మంది అమాయకులను ఈ సంస్థ మోసం చేసింది. తాజాగా, మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరవింద్ ఇలాగే మోసపోయి రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. అవి తిరిగివచ్చే దారి కానరాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అటు.. సినిమావాళ్లు, క్రికెటర్లు కూడా క్యూ‘నెట్’లో చిక్కుకున్నవాళ్లే. షారూక్ ఖాన్, పూజా హెగ్డే, అల్లు శిరీష్ ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారు. వీరికి సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కూడా తాఖీదులు ఇచ్చారు.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు