Home /News /crime /

TIKTOK TONY COMMIT SUICIDE DUE TO ISSUES WITH WIFE IN VISAKHAPATNAM FULL DETAILS HERE HSN

TikTok Tony: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

టిక్ టాక్ టోనీ (ఫేస్ బుక్ ఫొటో)

టిక్ టాక్ టోనీ (ఫేస్ బుక్ ఫొటో)

భార్యతో ఏర్పడిన చిన్న చిన్న పొరపొచ్చాల వల్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టిక్ టాక్ టోనీగా నెట్టింట ఫేమస్ అయిన ఆ కుర్రాడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

  యువత క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారోనో, ఉపాధ్యాయులు హెచ్చరించారనో ఉసురు తీసుకుంటున్న వాళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమ వ్యవహారం కూడా యువత ప్రాణాలను బలి తీసుకుంటోంది. భార్యాభర్తల మధ్య కలహాలు కూడా ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా భార్యతో ఏర్పడిన చిన్న చిన్న పొరపొచ్చాల వల్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టిక్ టాక్ టోనీగా నెట్టింట ఫేమస్ అయిన ఆ కుర్రాడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వాట్సప్ లో చివరి స్టేటస్ పెట్టి మరీ సెలవ్ అంటూ అందరికీ గుడ్ బై చెప్పాడు. నాలుగు నెలల క్రితమే పెళ్లయి, ప్రస్తుతం భార్య గర్భవతి అయినా కూడా భవిష్యత్తు గురించి అతడు ఆలోచించలేకపోయాడు. విశాఖపట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  విశాఖ జిల్లా భీమిలి బీచ్ రోడ్డు మంగమూరికిపేటకు చెందిన 25 ఏళ్ల గరికిన తాతారావు అలియాస్ టోనీ సిటీలలోని ఓ బిర్యానీ పాయింట్ లో పనిచేస్తుంటాడు. అతడు టిక్ టాక్ వీడియోలు చేయడం వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. అందుకే అంతా అతడిని టిక్ టాక్ టోనీ అని పిలుస్తుంటారు. నాలుగు నెలల క్రితతం అతడికి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలోని మరువాడ గ్రామానికి చెందిన పావని అనే యువతితో పెళ్లయింది. ఏప్రిల్ మూడో తారీఖున ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో మొదటి కాన్పునకు సంబంధించిన ఖర్చులను తామే భరిస్తామని చెప్పి పావని తండ్రి ఏప్రిల్ ఐదున తన కూతురిని తీసుకెళ్లిపోయాడు. వైద్య పరీక్షలు చేయించి మందులు ఇప్పించి మళ్లీ అత్తారింట్లో దించాడు.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

  శుక్రవారం రాత్రి డ్యూటీ నుంచి తిరిగొచ్చిన టోనీ తన తల్లిదండ్రులు, అక్కలు, వారి పిల్లలతో సరదాగా గడిపాడు. ‘ఈ రోజు నేనొక్కడినే రూమ్ లో పడుకుంటా’ అని అన్నాడు. అయినప్పటికీ తల్లిదండ్రులు పెద్ద కుమార్తె కొడుకును టోనీ గదిలో పడుకోమని చెప్పి పంపించారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సతీష్ కు మెలకువ వచ్చింది. తీరా చూస్తే గదిలో మామయ్య టోనీ ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. దీంతో భయాందోళనకు గురయిన సతీష్ బిగ్గరగా కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూస్తే జరిగిన ఘోరం బయటపడింది. భార్యతో వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలే ఈ ఘటనకు కారణమని తేల్చారు. ‘నువ్వు నా మాట వినవు కదా.. ఇక సెలవు’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టోనీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య పావని పుట్టింటికి వెళ్లి వచ్చాక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Tik tok, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు