హోమ్ /వార్తలు /crime /

నెల్లూరులో TikTok స్టార్ రఫీ ఆత్మహత్య.. గతంలో రఫీపై పలు ఆరోపణలు

నెల్లూరులో TikTok స్టార్ రఫీ ఆత్మహత్య.. గతంలో రఫీపై పలు ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ స్టార్ రఫీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ స్టార్ రఫీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ స్టార్ రఫీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ స్టార్ రఫీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టిక్‌టాక్ వీడియోల ద్వారా రఫీ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక, రెండు రోజుల క్రితం రఫీని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్టు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాపర్లు మరింత రెచ్చిపోయారని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకుకు బట్టలు ఊడదీసి కొట్టి, వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడతామని వారు రఫీకి బెదిరింపులు వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఏం చేయాలో తెలియక రఫీ ఆత్మహత్యకు చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

    ఇక, టిక్‌టాక్ వీడియోల‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రఫీపై గతంలో పలు రకాలు ఆరోపణలు ఉన్నాయి. 2019లో మరో టిక్‌టాక్ స్టార్ సోనికా కేతావత్‌తో కలిసి రఫీ, మరికొందరు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనిక తీవ్రంగా గాయపడింది. అయితే గాయాలతో చికిత్స పొందుతూ సోనికా హాస్పిటల్‌లో మృతిచెందింది. అయితే తొలుత రోడ్డు ప్రమాదం నుంచి సోనిక చిన్నపాటి గాయాలతోనే బయట పడిందని ప్రచారం జరగింది. దీంతో కొన్ని రోజుల తర్వాత మళ్లీ నవ్వుతూ అందరి ముందుకు వచ్చి మళ్లీ టిక్ టాక్ చేస్తుందని అంతా ఊహించారు కానీ చనిపోతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలోనే సోనిక మరణం వెనక చాలా రహస్యాలు ఉన్నాయంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పాటు టిక్ టాక్ చేసే ఇతర స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    అయితే తనపై వచ్చిన ఆరోపణలను రఫీ ఖండించారు. టిక్‌టాక్ మీట్ సోనిక తనకు పరిచయమైందని తెలిపారు. తాము మంచి స్నేహితులని.. తన స్నేహితురాలని ఎలా చంపుకుంటామని ప్రశ్నించారు. సోనిక తన లవర్ కాదని వెల్లడించారు. మరోవైపు రఫీకి అనారోగ్యంగా ఉందని అతని ఫ్రెండ్స్ టిక్‌టాక్ ఫ్యాన్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం తీవ్ర దూమారం రేపింది. ఆరోగ్యం పేరిట అమాయకుల నుంచి డబ్బుల వసూలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. కాగా, ఇప్పుడు రఫీ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.

    First published: