Home /News /crime /

TikTok స్టార్ విఘ్నేష్ కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ విషయం బయటపడంతో..

TikTok స్టార్ విఘ్నేష్ కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ విషయం బయటపడంతో..

టిక్ టాక్‌ స్ఠార్ అంబిలి అలియాస్ విఘ్నేష్ కృష్ణ

టిక్ టాక్‌ స్ఠార్ అంబిలి అలియాస్ విఘ్నేష్ కృష్ణ

టిక్ టాక్‌(TikTok) స్ఠార్ విఘ్నేష్ కృష్ణ(19)ను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనీస్ యాప్‌ల నిషేధానికి ముందు.. విఘ్నేష్ కృష్ణ తన టిక్‌టాక్ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే.

    టిక్ టాక్‌(TikTok) స్ఠార్ అంబిలి అలియాస్ విఘ్నేష్ కృష్ణ(19)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మైనర్ బాలిక గర్భం దాల్చేందుకు కారణమయ్యాడనే ఆరోపణలపై పోలీసులు అతన్ని శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని పోక్సోతో, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. విఘ్నేష్ కృష్ణ గతేడాది సోషల్ మీడియా ద్వారా ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరు కలుకున్నారు. ఆ తర్వాత విఘ్నేష్.. ఆమెకు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి.. రేప్ చేశాడు.

    అయితే బాలిక గర్భం దాల్చడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు విఘ్నేష్‌పై ఫిర్యాదు చేశారు. అయితే బాలిక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న విఘ్నేష్ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అదేసమయంలో విఘ్నేష్ కొద్ది రోజుల కిందటే పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసినట్టుగా తెలిసింది. దీంతో అతడు విదేశాలకు పారిపోవాలనే ఆలోచన ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    Hyderabad: వదిన అంటూ దగ్గరయి.. మహిళతో వివాహేతర సంబంధం.. వీరిద్దరు కలిసి ఎంత నీచమైన పని చేశారంటే..

    కొత్త రకం దందా.. నలుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వారు ఏం చేశారంటే..?

    ఈ క్రమంలోనే పోలీసులు విఘ్నేష్‌ను పట్టుకోవడానికి చిన్న ట్రిక్ ప్లే చేశారు. విఘ్నేష్ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి.. అతని పాస్‌పోర్ట్ రెడీ అయిందని చెప్పారు. దీంతో విఘ్నేష్ తండ్రి శనివారం.. త్రిసూర్ మెడికల్ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌కు వెళ్లి.. పాస్‌పోర్ట్ రెడీ అయిందన్న విషయాన్ని విఘ్నేష్‌కు తెలియజేశాడు.ఇక, విఘ్నేష్‌ తండ్రికి తెలియకుండా పోలీసులు అతడిని ఫాలో చేశారు. ఇలా విఘ్నేష్ జాడ కనుగొన్న పోలీసులు.. విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. చైనీస్ యాప్‌ల నిషేధానికి ముందు.. విఘ్నేష్ కృష్ణ తన టిక్‌టాక్ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Kerala, RAPE, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు