Home /News /crime /

TIKTOK SINGER RAJU COMMITTED SUICIDE IN TELANGANA NK

టిక్‌టాక్ సింగర్ రాజు ఆత్మహత్య... అదే కారణమా?

టిక్‌టాక్ సింగర్ రాజు ఆత్మహత్య... అదే కారణమా?

టిక్‌టాక్ సింగర్ రాజు ఆత్మహత్య... అదే కారణమా?

తన పాటలతో ప్రత్యేకంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాజు ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

    తెలంగాణ సిద్ధిపేట జిల్లాలో సింగర్ రాజు ఆత్మహత్య చేసుకున్నడాు. టిక్ టాక్ పాటలతో రాజు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అతని శైలి నచ్చి చాలా మంది అతనికి ఫాలోయర్లుగా మారారు. టిక్ టాక్‌లో రాజు ఏ వీడియో పెట్టినా... దాన్ని లైక్ చేస్తూ... అతన్ని ఎంకరేజ్ చేశారు. దాంతో రాజు... టిక్ టాక్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐతే... ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రాజు తిరిగి ఇంటికి రాలేదు. ఇంట్లో వాళ్లు రాజు కోసం ఎదురు చూసీ చూసీ... పొలానికి వెళ్లారు. అక్కడ దూరం నుంచి ఓ దృశ్యం చూసి షాక్ అయ్యారు. పరుగెట్టుకొని అక్కడకు వెళ్లి చూశారు. ఓ చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు రాజు.

    కోడూరు మండలం గంగాపూర్‌కి చెందిన రాజు  ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడాని చెప్పమ్మ' అనే పాటతో సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందాడు. రాజుకు సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. అలాంటిది అదే రాఖీ పండుగకు ఒక్కరోజు ముందు... ఆ పాటలో పదాలకు తగ్గట్టే రాజు ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.

    అసలు రాజు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో ఎవరికీ తెలియట్లేదు. ఆ పాట వల్లే మనస్తాపం చెంది చనిపోయాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు పొలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం రాజు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు రాసిన పోలీసులు... పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక... దర్యాప్తు చేసి... కారణమేంటో తెలుసుకుంటామన్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Tiktok

    తదుపరి వార్తలు