టిక్‌టాక్ ప్రేమ... కట్ చేస్తే జైల్లో యువకులు

Tiktok Love Cheating : ఇన్నాళ్లూ ఫేస్‌బుక్ మోసాలు చూసాం. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి టిక్‌టాక్ వచ్చి చేరింది. ఈమధ్య టిక్‌టాక్ పేరుతో జరుగుతున్న మోసాల సంఖ్య పెరుగుతోంది.

news18-telugu
Updated: November 9, 2019, 7:44 AM IST
టిక్‌టాక్ ప్రేమ... కట్ చేస్తే జైల్లో యువకులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Tiktok Love Cheating : టిక్‌టాక్ యాప్ చూశామా... నవ్వుకున్నామా... క్లోజ్ చేసామా అన్నట్లుండాలి. కానీ కొంతమంది డీప్‌గా వెళ్తారు. ఆ యాప్‌లో చూసేవన్నీ నిజమే అని నమ్ముతారు. అక్కడే తేడా కొడుతోంది. ఈ కేసులో అదే జరిగింది. తెలంగాణ... సిద్ధిపేట జిల్లా... గజ్వేల్ మండలం... మక్తమాసాన్ పల్లికి చెందిన 21 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలు టిక్‌టాక్ వీడియోలు చేసేవాళ్లు. వీళ్లలాగే... ఏపీలోని అనంతపురం జిల్లా... బొమ్మనహల్ మండలం... దర్గా హొన్నూర్‌కి చెందిన వంశీ, స్వామిలు కూడా టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్లు. ఒకరి వీడియోలు ఒకరు చూసుకునేవారు. ఆ చూపులు కాస్తా... మాటలయ్యాయి.... స్నేహాలకు దారితీశాయి... చివరకు ప్రేమగా రూపాంతరం చెందాయి. ఆరు నెలలు తిరిగేసరికి... పెళ్లి చేసుకోవాలని అందరూ ఫిక్స్ అయ్యారు.

ప్లాన్ ప్రకారం... పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు అమ్మాయిలూ... సీక్రెట్‌గా అనంతపురం వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక... ఆ అమ్మాయిలు ఇద్దరూ... అబ్బాయిలకు నచ్చలేదు. పెళ్లీ లేదు గీళ్లీ లేదు వెళ్లండి... అంటూ రివర్స్ అయ్యారు. అమ్మాయిలు ఇద్దరూ షాక్ అయ్యారు. టిక్ టాక్‌లో ఇన్ని కబుర్లు చెప్పి... ఇప్పుడు 600 కిలోమీటర్లు వస్తే... తిరిగి వెళ్లిపోమంటారేంటని ప్రశ్నించారు. తమను మోసం చెయ్యవద్దనీ, తమకు అన్యాయం చెయ్యవద్దనీ... పెళ్లి చేసుకోమనీ రకరకాలుగా వేడుకున్నారు. ఎన్ని చెప్పినా... ఆ యువకులు... ఏమాత్రం కరగలేదు. పైగా ఇద్దరూ అమ్మాయిలను ఇళ్లలోంచీ బయటకు గెంటేశారు. దాంతో వాళ్లిద్దరూ ఆహారం లేక... కళ్లు తిరిగి పడిపోయారు.

చుట్టుపక్కల ప్రజలకు విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు వచ్చి ఏంటి సంగతి అని అడిగితే... అసలా అమ్మాయిలు ఎవరో కూడా తమకు తెలియదని నాటకాలాడారు. టిక్ టాక్‌లో ఆధారాలు లభించాయి. వెంటనే ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. బాధిత అమ్మాయిలను అనంతపురం జిల్లా... ఉజ్వల్‌హోంకి తరలించారు. ఇదంతా టిక్‌టాక్ వల్లే జరిగిందని, ఆ యాప్‌ కొంపలు ముంచేస్తోందనీ అనుకోవడానికి లేదు. యాప్స్‌లో చూసి ప్రేమలో పడితే తప్పే. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలే కొంపలు ముంచుతాయంటున్నారు పోలీసులు.

 


Pics : తెలుగు తెరపైకి మరో అందాల కేరళ కుట్టి
ఇవి కూడా చదవండి :ఇద్దరు విద్యార్థినులపై లైంగిక వేధింపులు... ఏడుగురు టీచర్ల అరెస్టు

Ayodhya Verdict : రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు... అయోధ్య కేసు తీర్పుపై ముందు జాగ్రత్తలు

Ayodhya Verdict : దేశవ్యాప్తంగా హైఅలర్ట్... అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పేంటి?

RTC Strike : నేడు ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్...

సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...
First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు