టిక్ టాక్ వీడియో తీస్తూ ప్రాణం పోగొట్టుకున్న యువకుడు

టిక్ టాక్ అనే యాప్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఇందులో వీడియోలు చేస్తూ చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ నేపత్యంలోనే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Amala Ravula | news18-telugu
Updated: February 23, 2019, 3:49 PM IST
టిక్ టాక్ వీడియో తీస్తూ ప్రాణం పోగొట్టుకున్న యువకుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్ కావాలని, సెలబ్రిటీ కావాలని చాలామంది తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో చాలామంది టిక్ టాక్‌ని ఆశ్రయిస్తున్నారు. అందరికంటే వినూత్నంగా చేయాలంటూ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ప్రాణాలుపోగొట్టుకున్న ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడులోని తంజావూరులో నివసిస్తున్న ముగ్గురు యువకులు సూర్య, రైగాన్, విఘ్నేష్ కొత్తగా టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్ చేయాలనే ఆశతో బైక్‌పై వెళ్తూ వీడియో తీస్తున్నారు. ఒకరు బైక్ రైడ్ చేస్తుండగా.. మరొకరు వీడియో తీశారు..
కొంత దూరం బాగానే రైడ్ చేశారు. సడెన్‌‌గా వీరి బైక్‌కి బస్సుని ఢీకొంది. అంతే.. ముగురు అక్కడికక్కడే కిందపడి గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించేలోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ వీడియో టిక్‌టాక్ యాప్‌లో హల్ చల్ చేస్తోంది.

ఇంతకుముందు సెల్ఫీల మోజులో ఇలాంటి పిచ్చిపనులే చేసి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు చాలామంది. ఇప్పుడు టిక్ టాక్.. యాప్ ఏదైనా ప్రాణాలకు ముప్పు తప్పట్లేదు. ఇలాంటి ఘటనలు చూసైనా యువత మేలుకోవాలంటూ నిపుణులు చెబుతున్నారు.

First published: February 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు