ఓ టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోను అర్ధరాత్రి పోలీసులకు పంపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తినడం పోలీసులు వంతైంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాుల.. టిక్‌టాక్‌తో గుర్తింపు తెచ్చుకున్న సూర్య దేవి(Surya Devi) తిరుచ్చి జిల్లా మనప్పరాయిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే ఆమెకు భర్త, కూతరు ఉన్నారు. టిక్‌టాక్ ద్వారా ఫేమ్ తెచ్చుకన్న సూర్య దేవి.. పబ్లిసిటీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తునే ఉంది. టిక్ టాక్ నిషేధం తర్వాత కూడా ఆమె ఏదో ఒక పనితో వార్తల్లో నిలిచేలా చేసుకోవడం అలవాటుగా మార్చుకుంది. ఇందుకోసం ఆమె రాజకీయ, సినీ ప్రముఖలతో పాటు, పలువురు టిక్ టాక్ స్టార్‌లపై సోషల్ మీడియాలో(Social Medi) పోస్ట్ చేసి పబ్లిసిటీ పొందుతుంది.
ఇక, ఇటీవల టిక్‌టాక్(TikTok) స్టార్ సూర్య దేవిపై మధురై సుబ్రమణ్యపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన సిక్కా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తనపై దాడి చేసి చంపుతానని బెదిరించినట్టుగా చెప్పాడు. దీంతో సుబ్రహ్మణ్యపురం పోలీసులు సూర్య దేవిపై కేసు నమోదు చేశారు. మరోవైపు సూర్యదేవి.. సిక్కాపై దాడి చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె సిక్కాతో వాగ్వాదం దిగారు. చెప్పుల పట్టుకుని అతనిపై దాడి చేసేందుకు దూసుకెళ్తున్నట్టుగా కనిపించింది.
Police Asked Kiss: మహిళను ముద్దు అడిగిన పోలీసు అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..
ఈ క్రమంలోనే సూర్య దేవిపై మధురై(Madurai) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. అయితే ఉన్నట్టు ఉండి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రికార్డు చేసిన వీడియోను సూర్య దేవి మధురై పోలీసుల కమిషనర్‌కు వీడియో పంపారు. దీంతో అప్రమత్తమైన మధురై నగర కమిషనర్.. డీసీపీ బృందానికి సమాచారం అందించారు. దీంతో పోలీసుల బృందం వెంటనే ఆమె ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ఇంటి తలుపులు లాక్ చేయబడి ఉన్నాయి. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని అక్కడి రప్పించారు. ఆమె ఇంటి తలుపులు పగల గొట్టారు. అయితే ఇంతా చేసి లోనికి వెళ్లిన చూసిన పోలీసులు షాక్ తిన్నారు. ఇంట్లో సూర్య దేవి గాఢ నిద్రలో ఉండటం గుర్తించారు. ఆమె చేసిన పని పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా సూర్య దేవి పబ్లిసిటీ కోసమే చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సూర్య దేవి తాను డిప్రెషన్‌లో ఉన్నట్టుగా పోలీసులకు చెప్పింది.
ఇక, పోలీసులు సూర్య దేవి ఇంటికి అర్ధరాత్రి రావడం, ఇంటి తలుపులు బద్దలు కొట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పలువురు ఏం జరుగుతుందో తెలుసుకుందామని అక్కడి చేరుకున్నారు. తీరా అసలు విషయం తెలుసుకుని సూర్య దేవిపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంత ప్రజలు సూర్య దేవిని మందలించారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనిచేసిన సూర్య దేవిపై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamil nadu, Tiktok