Home /News /crime /

TIKTOK DELHI MANS BID TO HAVE MEMORABLE BIRTHDAY GOES WRONG ENDS IN JAIL AFTER POLICE TRACK HIM ON TIKTOK

Tik Tok: బర్త్‌డే పార్టీలో ఓవర్ యాక్షన్...కటకటాల వెనక్కి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TikTok | బర్త్ డే పార్టీలో నాటు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి ఓవర్ యాక్షన్ చేసి ఆ వీడియోను టిక్ టాక్‌లో పోస్ట్ చేసిన ఓ ఢిల్లీ వ్యక్తి కటకటాలపాలయ్యాడు.

    టిక్ టాక్ వ్యసనంతో కొందరు యువకులు కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తూ చివరికి తమ భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. తన బర్త్ డే వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకున్నాడు ఢిల్లీకి చెందిన ఆ వ్యక్తి. ఫ్రెండ్స్ సమక్షంలో కేక్ కట్ చేసి నాటు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియోని టిక్ టాక్‌లో పోస్ట్ చేశాడు. దీని ఆధారంగా జన్మదినం రోజునే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. పాత ఢిల్లీలోని చాంద్నీ మహాల్ ప్రాంతానికి చెందిన ఫైజన్ తన 32వ జన్మదినాన్ని ఆదివారం వేకువజామున తన ఫ్రెండ్స్‌తో కలిసి జరుపుకున్నాడు.

    టిక్ టాక్‌కు బానిసైన ఫైజన్ తన బర్త్ డే ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకున్నాడు. బర్త్ డే పార్టీలో తన దగ్గరున్న నాటుతుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వైరల్ అయ్యింది. వీడియో ఢిల్లీ పోలీసులకు కూడా చేరడంతో...సైబర్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. చాంద్ని మహల్ ప్రాంతంలోని తన ఇంట్లో ఉన్న ఫైజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

    ఫైజన్ తండ్రి క్యాటరింగ్ నిర్వహిస్తున్నాడు. తండ్రి క్యాటరింగ్ వ్యాపారానికి ఫైజన్ కూడా సహకరిస్తున్నాడు. పోలీసుల విచారణలో తన నేరాన్ని ఫైజన్ అంగీకరించాడు. నాటు తుపాకీ, వీడియో రికార్డు చేసిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Tik tok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు