టిక్‌టాక్ ఎంత పనిచేసింది.. పచ్చటి కాపురంలో చిచ్చు..

కొన్నాళ్లు సాఫీగానే సాగిన కాపురంలో సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. దివ్య టిక్‌టాక్‌కు ఎడిక్ట్ అయింది. దీంతో మహేష్ మందలించగా.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్తపై కోపంతో దివ్య బాబును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

news18-telugu
Updated: July 12, 2019, 7:52 AM IST
టిక్‌టాక్ ఎంత పనిచేసింది.. పచ్చటి కాపురంలో చిచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 12, 2019, 7:52 AM IST
పొద్దస్తమానం ఫోన్‌లో తలదూర్చడం.. అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకపోవడం..ఇదీ ఇప్పటిరోజుల్లో యువత వ్యవహార శైలి. క్షణం పాటు సెల్‌ఫోన్ లేకపోతే చాలు అల్లాడిపోతారు.ఫేస్‌బుక్,వాట్సాప్,టిక్‌టాక్.. చాటింగ్‌లు,వీడియో మేకింగ్‌లు వీటితోనే రోజంతా గడిచిపోతుంది.
వద్దని ఇంట్లో ఎవరైనా మందలించారంటే.. ఆరోజు పెద్ద గొడవ జరగాల్సిందే. గొడవలే కాదు.. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు భార్యాభర్తల మధ్య విడాకులకు కూడా దారితీస్తున్నాయి. చెన్నైలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లికి చెందిన చెందిన మహేష్‌ (37) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, తిరునెల్వేలికి చెందిన దివ్య (32)లకు

2008లో ప్రేమ వివాహం జరిగింది. ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా వెళ్లింది.2013లో వీరికి ఒక మగబిడ్డ పుట్టాడు. కొన్నాళ్లు సాఫీగానే సాగిన కాపురంలో సెల్‌ఫోన్ చిచ్చు పెట్టింది. దివ్య టిక్‌టాక్‌కు ఎడిక్ట్ అయింది. దీంతో మహేష్ మందలించగా.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్తపై కోపంతో దివ్య బాబును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.బాబునే అక్కడే స్కూల్లో చేర్చి తానూ ఓ ఉద్యోగంలో చేరింది. ఇటీవలే భర్తకు విడాకుల నోటీసులు కూడా పంపించింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భర్త మహేష్.. దివ్య తనతో కలిసుండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇదే క్రమంలో ఓరోజు తన కొడుకు చదువుతున్న స్కూల్ నుంచి మహేష్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఒంటి నిండా గాయాలున్నాయని స్కూల్ హెడ్ మాస్టర్ మహేష్‌తో చెప్పాడు.ఈ వ్యవహారంపై స్కూల్ హెడ్‌మాస్టర్ బాలల సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేయగా.. దానిపై విచారణ చేపట్టారు. బాలుడి తల్లి దివ్యకు అన్సారీ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. అంతేకాదు, దివ్యతో విడిపోయిన తర్వాత మహేష్ మరో పెళ్లి చేసుకున్నాడని గుర్తించారు. మహేష్ ఎవరో కూడా ఆ బాబుకు తెలియదన్నారు. అయితే ప్రస్తుతం కుమారుడు అనారోగ్యంతో ఉండటంతో తల్లికే అప్పగిస్తున్నట్టు చెప్పారు.First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...