Tiktok : టిక్ టాక్‌లో హీరో... కాల్చి చంపిన దుండగులు...

Delhi Crime News : సాయంత్రం వేళ 6 గంటలకు ఓ ఫొటో కాపీ షాప్‌లో కూర్చున్న మోహిత్ మోర్‌పై దుండగులు ఏడుసార్లు కాల్పులు జరపగా... అతను స్పాట్‌లో చనిపోయాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 11:56 AM IST
Tiktok : టిక్ టాక్‌లో హీరో... కాల్చి చంపిన దుండగులు...
మోహిత్ మోర్ (Image : Mohit Mor/Facebook)
  • Share this:
సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌పై ఎన్ని విమర్శలున్నాయో, అన్ని ప్రశంసలూ ఉన్నాయి. ఇంతకుముందు ప్రపంచానికి తెలియని ఎంతో మంది తమ టాలెంట్ ప్రదర్శిస్తూ... టిక్ టాక్ ద్వారా సెలబ్రిటీలు అవుతున్నారు. అలాంటి వాళ్లలో ఒకడు మోహిత్ మోర్. ఢిల్లీలో జిమ్ ట్రైనరైన ఆ 27 ఏళ్ల కుర్రాడు... టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. అలాంటిది ఔటర్ ఢిల్లీలో సాయంత్రం వేళ 6 గంటలకు ఓ ఫొటో కాపీ షాప్‌లో కూర్చున్న మోహిత్ మోర్‌పై దుండగులు ఏడుసార్లు కాల్పులు జరపగా... అతను స్పాట్‌లో చనిపోయాడు.

చనిపోయింది టిక్ టాక్‌లో 5.17 లక్షల ఫాలోయర్స్ ఉన్న మోహిత్ మోర్‌ అని పోలీసులు నిర్ధారించారు. అతను హర్యానాలోని బహదూర్‌ఘర్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం ఢిల్లీలోని నజఫ్‌ఘర్‌లో ఉంటున్నాడు. అతన్ని చంపింది ద్వారకా మోద్‌లోని క్రిమినల్స్ గ్యాంగే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. అక్కడి రెండు ముఠాల మధ్య ఇటీవల జరిగిన అల్లర్లకూ, మోహిత్ మోర్‌కూ ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఐతే మోహిత్‌కి ఎలాంటి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండూ లేదు.

మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు... కాల్పులు జరిగిన చోట CCTV కెమెరా ఫుటే‌జ్‌ను పోలీసులు సేకరించారు. అందులో కాల్పుల తర్వాత ముగ్గురు పారిపోయారు. వాళ్లలో ఇద్దరి తలలకు హెల్మెట్లు ఉన్నాయి. వాళ్లెవరో కనిపెట్టాలని పోలీసులు అనుకుంటున్నారు. వాళ్లు వచ్చిన స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ సరిగా కనిపించకపోయినా, తెలుసుకుంటామని అంటున్నారు.

మోహిత్‌కి తండ్రి లేరు. తల్లి, సోదరుణ్ని అతనే చూసుకుంటున్నాడు. ఈ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో పోలీసులు పరిశీలిస్తున్నారు.



 

ఇవి కూడా చదవండి :

కర్ణాటకలో మళ్లీ ఎన్నికలొస్తాయా..? ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ఢిల్లీ మాల్ స్పాలో సెక్స్ రాకెట్... ఒక్కో పనికి ఒక్కో రేటు

పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య

నేడు అమరావతికి జగన్... బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ
First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు