Tik Tok: కేసీఆర్‌ను, పోలీసులను తిడుతూ టిక్ టాక్ వీడియోలు... యువకుడి అరెస్ట్...

Tik Tok: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావునూ, తెలంగాణ పోలీసులను తిడుతూ ఓ టిక్ టాక్ వీడియో తీసి, చిక్కుల్లో ఇరుక్కున్న కరీంనగర్ యువకుడు... కేసు నమోదుచేసి యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 8:48 PM IST
Tik Tok: కేసీఆర్‌ను, పోలీసులను తిడుతూ టిక్ టాక్ వీడియోలు... యువకుడి అరెస్ట్...
టిక్ టాక్ నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 20, 2019, 8:48 PM IST
Tik Tok... ఈ మధ్య కాలంలో నెటిజన్స్ మనసు దోచుకున్న యాప్. ఎంతగా పాపులారిటీ పొందిందో, అంతగా వివాదాల్లో చిక్కుకుంటోందీ యాప్. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వానికి వేలల్లో డిమాండ్లు వచ్చాయి. టిక్ టాక్ వీడియోల్లో పెరిగిపోతున్న అశ్లీలత, బూతు కంటెంట్ అందుకు ప్రధాన కారణం. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు కుర్రకారు. తాజాగా ఓ యువకుడు... తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావునూ, తెలంగాణ పోలీసులను తిడుతూ ఓ టిక్ టాక్ వీడియో తీసి, చిక్కుల్లో పడ్డాడు. టిక్ టాక్ యాప్‌లో సాయి రాయల్స్ ఐడీతో ఉన్న ఓ కరీంనగర్ యువకుడు... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును తిడుతూ వీడియో తీశాడు. నిజామాబాద్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... బీజేపీ గురించి, హిందుత్వ వాదన గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ‘బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులని, తామే అసలైన హిందువులని అన్నారు.

ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ టిక్ టాక్ వీడియో రూపొందించిన సాయి... సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పక్కనే ఉన్నా కేసీఆర్ మాటలను చూస్తూ నిలిచి ఉండిపోయారంటూ తెలంగాణ పోలీసులను బండ బూతులు తిట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన కరీంనగర్ పోలీసులు... సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ చట్టాల కింద అతనిపై కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. బీజేపీ అభిమానిగా గుర్తింపు పొందిన సదరు యువకుడు ఇంతకు ముందు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని తిడుతూ వీడియోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది.


First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...