TikTok బ్యాన్ అయ్యిందనే బాధ తట్టుకోలేక...యువతి డిప్రెషన్ లో కూరుకుపోయి...

టిక్ టాక్ లో ఓ స్టార్ గా వెలిగిన సియా నిత్యం టిక్ టాక్ వీడియోలతో తన ఫాలోయర్లను ఆకట్టుకునేది. అయితే గత నెల టిక్ టాక్ యాప్ బ్యాన్ కావడంతో యువతి ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

news18-telugu
Updated: July 11, 2020, 9:41 PM IST
TikTok బ్యాన్ అయ్యిందనే బాధ తట్టుకోలేక...యువతి డిప్రెషన్ లో కూరుకుపోయి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్ టాక్ యాప్ బ్యాన్ అయ్యిందనే డిప్రెషన్ లో ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...సియా కక్కర్ అనే యువతి వయస్సు 19 సంవత్సరాలు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న సియా గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లోకి కూరుకుపోయింది. టిక్ టాక్ లో ఓ స్టార్ గా వెలిగిన సియా నిత్యం టిక్ టాక్ వీడియోలతో తన ఫాలోయర్లను ఆకట్టుకునేది. అయితే గత నెల టిక్ టాక్ యాప్ బ్యాన్ కావడంతో యువతి ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అన్నం తినడం మానేసింది. ఇంట్లోనే ఓ గదిలో కూర్చొని రోదించేది. కుటుంబసభ్యులు యూపీలోని సహరన్ పూర్ లో ఉండగా, లాక్ డౌన్ కారణంగా సియా ఢిల్లీలోనే ఉండిపోయింది.

దీంతో అటు ఒంటరితనంతో పాటు టిక్ టాక్ బ్యాన్ అయ్యిందనే బాధతో యువతి ఉరి వేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా యువతి ఇంటి పక్కన ఉన్న వారు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 9:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading