Tik Tok: కేసీఆర్‌ను తిడుతూ టిక్ టాక్ వీడియోలు... కృష్ణాజిల్లా యువకుడి అరెస్ట్...

Tik Tok: తెలంగాణ ముఖ్యమంత్రిని తిడుతూ టిక్ టాక్ వీడియో చేసిన కృష్ణా జిల్లా వాసి... కేసు నమోదుచేసి అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు... ఫ్రెండ్స్‌తో సరదాగా ఆ వీడియో చేశానని చెప్పిన నిందితుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 1:50 PM IST
Tik Tok: కేసీఆర్‌ను తిడుతూ టిక్ టాక్ వీడియోలు... కృష్ణాజిల్లా యువకుడి  అరెస్ట్...
నిందితుడి ఫోటోను చూపిస్తున్న కమీషనర్ మహేష్ భగవత్
  • Share this:
Tik Tok... ఈ మధ్య కాలంలో నెటిజన్స్ మనసు దోచుకున్న యాప్. ఎంతగా పాపులారిటీ పొందిందో, అంతగా వివాదాల్లోనూ చిక్కుకుని నిషేధం విధించేదాకా వెళ్లింది. టిక్ టాక్ వీడియోల్లో పెరిగిపోతున్న అశ్లీలత, బూతు కంటెంట్ అందుకు ప్రధాన కారణం. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు కుర్రకారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు... తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావునూ తిడుతూ ఓ టిక్ టాక్ వీడియో తీసి, చిక్కుల్లో పడ్డాడు. కృష్ణా జిల్లాకు చెందిన నవీన్... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును తిడుతూ వీడియో తీశాడు. అది కాస్తా వైరల్ కావడంతో అతనిపై కేసు నమోదుచేసిన హైదరాబాద్ పోలీసులు... నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని, కేవలం తన ఫ్రెండ్స్ ముందు సరదాగా ఓ వీడియో తీశానని నవీన్ పోలీసులకు చెప్పడం విశేషం. చేసిన తప్పు అంగీకరించడంతో నవీన్‌ను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు... అతనిపై కేసు నమోదుచేశారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు.

సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినా, ఇలా ఒకరిని దూషిస్తూ వీడియోలు చేసినా నేరమని తెలియక చాలామంది ఇలాంటి పనులకు పాల్పడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను తిడుతూ ఇలాగే ఓ వీడియో తీశాడు కరీంనగర్ వాసి. భారతీయ జనతా పార్టీ మద్ధతుదారుడిగా గుర్తింపుపొందిన సదరు వ్యక్తి... టిక్ టాక్‌లో కేసీఆర్‌ను బండ బూతులు తిడుతూ వీడియో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో కేసు నమోదుచేసిన పోలీసులు... అతన్ని అరెస్ట్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఆంధ్రవాసి ఇలాంటి చర్యకు పాల్పడి, సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కడం విశేషం. నవీన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ కేసు గురించి వివరించారు.




First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు