Home /News /crime /

TIHAR JAIL PRISONER STABS INMATE AVENGE MOLESTING MINOR SISTER BN

చెల్లిపై వ్యక్తి అత్యాచారం.. ఆరేళ్ల తర్వాత తీహార్ జైలులో పగ తీర్చుకున్న అన్న..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

2014 సంవత్సరంలో మెహతాబ్(28) అనే వ్యక్తి జకీర్ చెల్లెలు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం తీహార్ సెంట్రల్ జైలుకు పంపారు.

  ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఫలితంగా అతడు జైలు పాలయ్యాడు. అయితే బాలిక అన్న తన చెల్లిపై జరిగిన అకృత్యాన్ని మర్చిపోలేకపోయాడు. ఏలాగైనా తన చెల్లి మరణానికి కారణమైన వ్యక్తిని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చాడు. అందులో భాగంగానే ఖైదీగా మారి ఆరు సంవత్సరాల తర్వాత తీహార్ జైలులో తన చెల్లిపై అత్యాచారం చేసి మరణానికి కారణమైన వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని తీహార్ జైలులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జకీర్(22) అనే వ్యక్తి తన చెల్లితో కలిసి ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ ఏరియాలో ఉంటున్నాడు. అయితే 2014 సంవత్సరంలో మెహతాబ్(28) అనే వ్యక్తి జకీర్ చెల్లెలు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.

  దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం తీహార్ సెంట్రల్ జైలుకు పంపారు. అయితే ఆ బాలిక తనపై జరిగిన అకృత్యాన్ని మర్చిపోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలావుంటే.. జకీర్ తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేకపోయాడు. తీవ్ర ఆవేదన చెంది.. ఏలాగైనా తన చెల్లి మరణానికి కారణమైన వ్యక్తిని ఏలాగైనా చంపాలని భావించాడు. ఈ క్రమంలోనే ఓ హత్య కేసులో తీహార్ జైలుకెళ్లాడు. జైలులోని నంబరు 8లో మహతాబ్ ఉన్నాడని జకీర్ తెలుసుకున్నాడు.

  అతడిని ఏలాగైనా అంతమొందించేందుకు పథకం వేశాడు. తన తోటి ఖైదీలు ఇబ్బంది పెడుతున్నారని.. తనను నంబరు 4 నుంచి మార్చాలని పోలీసులను కోరాడు. దీంతో జకీర్ తాను అనుకున్నట్టుగానే మహతాబ్ ఉండే 8వ నంబరుకు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మహతాబ్‌ను కసితీరా పొడిచి చంపేశాడు. దీనిపై జైలు అధికారులు స్పందిస్తూ జూన్ 29న ఉదయం సమయంలో ప్రార్థన జరుగుతుండగా మిగతా ఖైదీలు బయటకు వచ్చారు.

  దీంతో జకీర్.. మహతాబ్ ఉన్న ఫ్లోరుకు వెళ్లి కత్తిలాంటి పదునైనా ఆయుధంతో అతడిని పొడిచి చంపినట్టు తెలిపారు. అతడిపై సెక్షన్ 302 ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
  First published:

  Tags: Jail, Murder, Tihar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు