ఈ నెల 5వ తేదీన ఇచ్చోడలో పులిచర్మం పట్టుబడ్డ ఘటన మరిచిపోకముందే.. మంచిర్యాల జిల్లాలో మరో పులి చర్మం పట్టుబడటం అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రిలోని లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో పులిచర్మం పట్టుబడింది. చర్మం నుంచి ఇంకా పచ్చి వాసన వస్తుండటంతో 15-20 రోజుల క్రితమే పులిని చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. లింగయ్య ఇంట్లో పులిచర్మం ఉన్నట్టుగా మహారాష్ట్రకు చెందిన ఓ ఎన్జీవోకు మొదట సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులకు వారు సమాచారాన్ని చేరవేశారు.
సీసీటివి దృశ్యాలు బయటకు రావడంతో.. జన్నారం పరిధిలో పులి సంచరిస్తుందన్న విషయం వేటగాళ్ల దృష్టికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. పులి సంచరిస్తుందన్న విషయం బయటకు పొక్కడమే దానికి శాపంగా మారిందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.కాగా, తాజాగా పట్టుబడ్డ పులిచర్మానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. లింగయ్యతో పాటు మందమర్రి, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
ఈ వీడియో చదవండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Save Tigers, Tiger Attack