రైల్లో టీటీఈ లైంగిక వేధింపులు...మహిళకు మత్తుమందు ఇచ్చి...

ట్వీట్‌పై స్పందించిన ఐఆర్‌సీటీసీ ఈస్ట్ జోన్..రైల్లో సదరు మహిళకు ఎదురైన చేదు అనుభవం పట్ల క్షమాపణ చెప్పింది. దీనిపై విచారణ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపింది.

news18-telugu
Updated: August 7, 2019, 5:10 PM IST
రైల్లో టీటీఈ లైంగిక వేధింపులు...మహిళకు మత్తుమందు ఇచ్చి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. మారుమూల ప్రాంతాలే కాదు..చుట్టూ జనాలున్న బహిరంగ ప్రదేశాల్లోనూ ఆడవారికి వేధింపులు తప్పడం లేదు. ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయింది. రైల్వే టీటీఈ హోదాలో ఉన్న వ్యక్తి మహిళను లైంగికంగా వేధించాడు. ఐస్‌క్రీమ్‌లో మత్తు మందు కలిపి అసభ్యంగా ప్రవర్తించాడు. రైల్లోని ప్యాంట్రీ సిబ్బందితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఎలాగోలా తప్పించుకొని వారి బారి నుంచి బయటపడింది. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

రైల్లో తనకు జరిగిన అన్యాయాన్ని సహచరులతో చెప్పుకొని బోరున విలపించింది బాధితురాలు. ఈ భయానక ఘటనను ట్విటర్ వేదికగా ఓ కాలేజీ విద్యార్థిని వెలుగులోకి తెచ్చింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో సాక్షాత్తు టీటీయే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. అతడిపై ఎవరైనా చర్యలు తీసుకోగలరా..? అని ప్రశ్నించింది. అతడు దర్జాగా తిరుగుతూ మరో మహిళలను కూడా వేధిస్తాడని అభిప్రాయపడింది. ఆ ట్వీట్‌పై స్పందించిన ఐఆర్‌సీటీసీ ఈస్ట్ జోన్..రైల్లో సదరు మహిళకు ఎదురైన చేదు అనుభవం పట్ల క్షమాపణ చెప్పింది. దీనిపై విచారణ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది రైల్వేశాఖ.
First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు