దళిత వర్గానికి చెందిన తండ్రీకొడుకులపై అమానుషం.. 15 మంది దుండగులు వారికి బలవంతంగా మూత్రం తాగించారు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: రాజస్థాన్‌ రాష్ట్రంలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత వర్గానికి చెందిన తండ్రీకొడుకుల చేత కొంతమంది దుండగులు బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటన బార్మెర్‌‌లోని బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహద్ కా తాలా గ్రామంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా ఎక్కడో ఒక దగ్గర పరువు హత్యలు, మూఢ నమ్మకాలు, చాతబడులు అనేవి జరుగుతునే ఉన్నాయి. కులాలు, మతాల పేరుతో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దళిత వర్గానికి చెందిన తండ్రీ కొడుకుల చేత కొంతమంది బలవంతంగా మూత్రం తాగించారు. వాళ్లను విపరీతంగా కొట్టి.. రోడ్డు వైపు లాక్కెళ్లి బలవంతంగా నోరు తెరిచి మూత్రం తాపించారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ లోని బార్మెర్‌ బిజ్రాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోహద్ కా తాలా గ్రామంలో దళిత వర్గానికి చెందిన రాయ్‌చంద్ మేఘవాల్ తన కుమారుడు రమేష్‌ కలిసి నివసిస్తున్నారు. వారికి ఇంట్లో కిరాణా సామాన్లు అయిపోయాయి. వాటిని తీసుకొని రాడానికి అదే గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్లారు. అక్కడ దాదాపు 15 మంది దుండగులు కలిసి వారిపై ఒక్కసారిగా దాడి చేశారు. వారిని విపరీతంగా కొట్టారు. అంతే కాకుండా అక్కడ నుంచి రోడ్డుపైకి లాక్కెళ్లి కర్రలతో, రాళ్లతో కొట్టారు.

  ఈ దాడిలో రాయ్‌చంద్ పన్ను ఊడిపోగా.. రమేష్ కాలు విరిగింది. వాళ్ల అరుపులకు గ్రామంలోని చుట్టు పక్క వాళ్లు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వాళ్లు చూస్తుండగానే కులం పేరుతో దూషిస్తూ.. రాయ్‌చంద్‌తో మూత్రం తాగించారు. అంతే కాకుండా తన కొడుకును కాళ్లు చేతులను ఇద్దరు పట్టుకొని అతి కిరాతంగా కొట్టారు. గ్రామస్తులు బొమ్మల్లా చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. అనంతరం వాళ్లు అక్కడ నుంచి పారిపోయారు.

  ఆ గ్రామంలోని కొంత మంది స్పందించి.. బాధితులను ప్రథమ చికిత్స కోసం చౌహతాన్‌‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత బార్మెర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. పోలీసులకు సమాచారం తెలవడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రీకొడుకుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఖేత్ సింగ్ తో సహా 14 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్ల మధ్య ఇది వరకే పాత కక్షలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
  Published by:Veera Babu
  First published: