గుంటూరు జిల్లాలో దారుణం.. మహిళను హత్య చేసి..

సదరు మహిళ ఏటూరుకు చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. అయితే ఈ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేసినట్టు తెలుస్తోంది. మహిళ మృతదేహం పక్కనే అపస్మారకస్థితిలో యువకుడు సైతం పడి ఉన్నాడు.

news18-telugu
Updated: May 9, 2020, 12:28 PM IST
గుంటూరు జిల్లాలో దారుణం.. మహిళను హత్య చేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా మట్టిచెరుకూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ఐదో మైలు దగ్గర పొలంలో ఓ మహిళ మృతదేహం కన్పించింది. సదరు మహిళ ఏటూరుకు చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. అయితే ఈ మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేసినట్టు తెలుస్తోంది. మహిళ మృతదేహం పక్కనే అపస్మారకస్థితిలో యువకుడు సైతం పడి ఉన్నాడు. ఆ యువకుడు కొండెపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: May 9, 2020, 12:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading