ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం అనేది నేరం కాదు. కానీ వివాహిత మహిళకు ప్రేమ పేరుతో లవ్ లెటర్ రాస్తే అది కచ్చితంగా నేరమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహిళకు తన క్యారెక్టరే విలువైనదని హైకోర్టు తెలిపింది. ప్రేమ పేరుతో లవ్ లెటర్ పంపిస్తే మాత్రం అది కచ్చితంగా ఆమెను అవమానించినట్లే అని హైకోర్టు తెలిపింది. తాజాగా పెళ్లైన మహిళకు ఓ వ్యక్తి లవ్ లెటర్ రాస్తే ఆ వ్యక్తికి బాంబే హైకోర్టులోని హైకోర్టులోని నాగ్ పూర్ ధర్మాసనం అతడికి రూ.90వేల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2011 సంవత్సరంలో ఓ కిరాణ దుకాణం నడిపే వ్యక్తి అక్కడ పనిచేసే పెళ్లయిన మహిళకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆమె దానికి ససేమిరా అనడంతో ఆమెపై ఆ లవ్ లెటర్ చింపేసి విసిరేశాడు. మరుసటి రోజు కూడా అతడు ఇలానే చేయడంతో ఆమె అకోలా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2018లో సెషన్స్ కోర్టు నిందితునికి రెండేళ్ల కారాగార శిక్ష, రూ. 40 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దానికి అతడు ఇలా చెప్పాడు.. బాధిత మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని.. తనను అడిగినందుకే తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని అతడు హైకోర్డులో చెప్పాడు. అయితే ఈ కేసులో ఆమె తరఫున పక్కా ఆధారాలు ఉండటంతో అతడి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.
అప్పటికే నిందితుడు 45 రోజుల పాటు జైలులో ఉన్నందున జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించింది. జరిమానా మాత్రం రూ. 90వేలకు పెంచింది. అందులో బాధితురాలికి రూ.85 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిని ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేసి, బాధితురాలికి పరిహారంగా చెల్లించాలన్నారు. ఈ తీర్పుపై బాధితురాలికి అవగాహన కల్పించేలా ట్రయల్ మేజిస్ట్రేట్ నిర్ధారిస్తారని.. మరణం లేదా మరేదైనా కారణం వల్ల బాధితుడు అందుబాటులో లేనట్లయితే.. ఆమెకు లేదా ఆమె వారసులకు జరిమానా చెల్లించాలని హైకోర్టు పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bombay high court, Crime, Mumbai