తన కోరిన తీర్చలేదని.. భార్య అక్కపై దారుణానికి పాల్పడ్డాడు.. మరో ఘటనలో కట్టుకున్న భార్యను బలవంతంగా..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

Crime News: కామంతో కల్లుమూసుకుపోయిన వాడు ఒకడైతే.. కట్టుకున్న భార్యను సైకోలా ప్రవర్తించి చిత్రహింసలకు గురిచేసిన వాడు మరొకడు. ఈ రెండు ఘటనల్లో ఒకటి మధ్య ప్రదేశ్ లో చోచుచేసుకోగా.. మరొకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  వారిద్దరు భార్యభర్తలు. పెళ్లి జరిగి చాలా కాలం అవుతోంది. అయితే భార్యకు ఓ అక్క ఉంది. ఎలాగైనా ఆమెను అనుభవించాలనే కోరిక అతడికి బలంగా నాటుకుంది.  లైంగిక వాంఛ తీర్చాలని పలు మార్లు ఆమెను వేధించాడు. ఆమె దానికి నిరాకరిస్తూ వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఓ రోజు అతడి ఇంటికి వచ్చిన ఆమెపై యాసిడ్ పోసి దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే అతడి భార్య  ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.


  మరో ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగింది. భార్యతో కట్టుకున్న భర్తే బలవంతంగా యాసిడ్ తాగించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా ఇంత వరకు అతడిని అరెస్టు చేయలేదని ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ స్వాతి మ‌లివాల్ ట్వీట్ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు కాగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను స‌బ్ డివిజ‌న‌ల్ మేజిస్ట్రేట్ ఎదుట న‌మోదు చేశార‌ని ఆమె పేర్కొన్నారు.


  నిందితుడిని స‌త్వ‌ర‌మే అరెస్ట్ చేసేలా చొర‌వ చూపాల‌ని స్వాతి మ‌లివాల్ మధ్యప్రదేశ్ సీఎం శివ‌రాజ్ చౌహాన్‌ను ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: