ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్‌లోనే.. మృతుల్లో ఒకరు కానిస్టేబుల్..

చేవెళ్ల నుంచి స్వగ్రామమైన ఆలూరుకు వెళ్తుండగా అతి వేగంతో ఉన్న కారుకు ఓ వాహనం అడ్డు రావడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

news18-telugu
Updated: May 31, 2020, 11:03 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్‌లోనే.. మృతుల్లో ఒకరు కానిస్టేబుల్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ స్టేజీ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి రెండు కాళ్లు విరిగిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. వీరు చేవెళ్ల నుంచి స్వగ్రామమైన ఆలూరుకు వెళ్తుండగా అతి వేగంతో ఉన్న కారుకు ఓ వాహనం అడ్డు రావడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ముగ్గురిని ఎన్కతల రఘు, సారె నరేష్, గారెల్లా రాఘవేందర్‌గా గుర్తించారు. మరొకరు నడికుడి నవీన్ వ్యక్తిగా గురించగా, అతడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన వారిలో ఎన్కతల రఘు వికారాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Published by: Narsimha Badhini
First published: May 31, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading