THREE YOUTH MAKING INDECENT COMMENTS ON GIRL AND STABBED HER BROTHER FOR OBJECTED TO IT HSN
అన్నతో కలిసి బయటకు వెళ్లిన చెల్లి.. ముగ్గురు కుర్రాళ్లు ఫాలో అవుతూ ఆమెపై కామెంట్స్ చేస్తోంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఓ 17 ఏళ్ల కుర్రాడు తన చెల్లితో కలిసి బయటకు వెళ్లాడు. వాళ్లిద్దరూ రోడ్డుపై నడుస్తుండగా ముగ్గురు యువకులు వారిని అనుసరించడమే కాకుండా తీవ్ర దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో ఆ కుర్రాడి చెల్లి గురించి కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ కుర్రాడు..
ఓ 17 ఏళ్ల కుర్రాడు. తన చెల్లితో కలిసి బయటకు షాపింగ్ కు వెళ్లాడు. రోడ్డుపై నడుస్తూ ఉండగా ఓ ముగ్గురు యువకులు వారి వెనకే రావడం మొదలుపెట్టారు. వారిని అనుసరించడమే కాకుండా, ఆ కుర్రాడి చెల్లి గురించి కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. సెటైర్లు వేస్తూ, అసభ్యపదజాలంతో ఆ ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. దీంతో ఆ కుర్రాడికి కోపం తన్నుకొచ్చింది. తన చెల్లి గురించి నానా మాటలు అంటున్న వారిని ఎదురించాడు. వారితో గొడవకు దిగాడు. అయితే వాళ్లు ఒకరికి ముగ్గురు ఉండటంతో ఆ కుర్రాడే తీవ్ర గాయాలపాలవాల్సి వచ్చింది. ఆ కుర్రాడిని కత్తితో కూడా పొడవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో కల్కాజీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కల్కాజీ ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు తన చెల్లితో కలిసి బయటకు వెళ్లాడు. వాళ్లిద్దరూ రోడ్డుపై నడుస్తుండగా ముగ్గురు యువకులు వారిని అనుసరించడమే కాకుండా తీవ్ర దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో ఆ కుర్రాడి చెల్లి గురించి కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ కుర్రాడు, ఆ ముగ్గురు యువకులతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో ఆ ముగ్గురు యువకులు కుర్రాడిని తీవ్రంగా కొట్టారు. వారిలో ఒకరు కుర్రాడిని కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో అతడిని వదిలేసి వెళ్లిపోయారు.
తీవ్ర గాయాలపాలయిన అతడిని చెల్లి ఆసుపత్రిలో చేర్పించింది. అతడు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అయితే ఈ ఘటన విషయమై శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని కోరింది. దీంతో సౌత్ ఈస్ట్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆర్పీ మీనా ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.