విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

యువకుల మృతితో అగ్రహారం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యుడైన లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: February 12, 2019, 2:57 PM IST
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 2:57 PM IST
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఓ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికకకడే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం అగ్రహారానికి చెందిన కె. వరప్రసాద్‌ (16), కార్తీక్‌ (16,ఆర్‌.నవీన్‌(18) అనే ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై యలమంచిలి వైపు బయలుదేరారు. ఈ క్రమంలో అగ్రహారం చౌరస్తా వద్ద అవతలి వైపు రోడ్డు దాటుతుండగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది.

ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. వరప్రసాద్ మృతదేహాన్ని లారీ కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. పులపర్తి గ్రామం వద్ద అతని మృతదేహం లభ్యమైంది. యువకుల మృతితో అగ్రహారం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యుడైన లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...