తెలంగాణలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... 12 గంటలపాటూ చిత్రహింసలు...

Telangana News : అత్యాచారాల్ని నిరోధించడానికి నిర్భయ చట్టం తెచ్చారేగానీ... ఆ చట్టం ద్వారా శిక్షలు అమలవుతున్నది చాలా తక్కువ. ఫలితంగా రేపిస్టులు రెచ్చిపోతూనే ఉన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 10:07 AM IST
తెలంగాణలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్... 12 గంటలపాటూ చిత్రహింసలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఎంతో మంచి రాష్ట్రం. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే... ఇక్కడ మహిళలపై జరిగే అఘాయిత్యాలు తక్కువే. అలాంటి మంచి రాష్ట్రంలో ఓ దళిత బాలికపై దారుణం జరిగింది. సిద్ధిపేట జిల్లా... జగదేవ్‌పూర్‌ మండలంలోని... రాయవరం గ్రామంలో జరిగిందీ ఘోరం. అసలే ఎండాకాలం కావడంతో ఇంటి తలుపులు తెరిచి నిద్రపోతున్నారు ఇంట్లో వాళ్లు. గుమ్మం బయట పడుకుంది ఆ మైనర్ బాలిక (16). అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు (వెంకట్, అంజి, మరో కుర్రాడు)... రాత్రివేళ ఆ బాలికను చూశారు. సైలెంట్‌గా దగ్గరకు వెళ్లి... నోరు నొక్కి అక్కడి నుంచీ ఎత్తుకుపోయారు. ఆ బాధితురాలు అరించేందుకు ఎంతలా ప్రయత్నించినా... వాళ్లు ముగ్గురూ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా రెచ్చిపోయారు.

బాలికను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన కేటుగాళ్లు... ఒకరి తర్వాత ఒకరుగా గ్యాంగ్ రేప్ చేశారు. అంతేకాదు... రాత్రంతా దాదాపు 12 గంటలపాటూ... రకరకాలుగా చిత్ర హింసలు పెట్టారు. చావు అంచులదాకా వెళ్లిన ఆ అభాగ్యురాలు... ఎలాగొలా వాళ్ల బారి నుంచీ తప్పించుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఆమెను హత్తుకొని... కన్నీరు పెట్టారు. ఆమెకు ధైర్యం చెప్పి... పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన కేటుగాళ్ల కోసం వెతుకుతున్నారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 

ఇవి కూడా చదవండి :

అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారు... తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ హాసన్

పాకిస్థాన్ యువతి ఉచ్చులో భారత జవాన్‌... కొంపముంచిందిగా...

ఎల్ఈడీ బల్బులతో ప్రమాదం... కళ్లుపోతాయ్..!!బెంగాల్‌లో బీజేపీ వ్యూహం ఫలిస్తోందా... మమతాబెనర్జీకి షాక్ తప్పదా..?
First published: May 17, 2019, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading