విషాదం.. ద్విచక్ర వాహనం స్టంట్స్ చేస్తూ ముగ్గురు యువకులు మృతి..

ప్రతీకాత్మక చిత్రం

ముగ్గురు ద్విచక్ర వాహనాలపై దూసుకుపోతున్నారు. అయితే ఉన్నట్టుండి వారు స్టంట్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పింది.

  • Share this:
    బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై స్టంట్స్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని గోవిందపురకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయం రోడ్డుకు వెళ్లారు. ఆ రోడ్డుపై ముగ్గురు కలిసి స్టంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ముగ్గురు ద్విచక్ర వాహనాలపై దూసుకుపోతున్నారు. అయితే ఉన్నట్టుండి వారు స్టంట్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరులోని ఎలహంక పోలీసులు చెప్పారు. ఇదిలావుంటే.. లాక్‌డౌన్ నేపథ్యంలో రోడ్లపై రద్దీ అంతగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లోనూ కొంతమంది యువకులు ఈ తరహా విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
    First published: