బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి.. 17 అడుగుల లోతులో మృతదేహం..

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్ మృతి చెందాడు. 12 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 17 అడుగుల లోతు వద్ద మృతదేహం లభించింది.

news18-telugu
Updated: May 28, 2020, 9:03 AM IST
బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి.. 17 అడుగుల లోతులో మృతదేహం..
బోరుబావిలో పడిన బాబు
  • Share this:
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్ మృతి చెందాడు. 12 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 17 అడుగుల లోతు వద్ద మృతదేహం లభించింది. గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే  బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వివరాల్లోకెళితే.. భిక్షపతి బుధవారం తన పొలంలో బోర్లు వేశాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో మూడో బోరు బావిని కూడా తవ్వించారు. ఐతే ఆయన మనవడు సాయి వర్ధన్ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వచ్చాడు. బోర్లు వేసిన అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో.. అతడు ఆడుకుంటూ వెళ్లి ఓ బోరుబావిలో పడిపోయాడు. వారి పొలంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

తాత భిక్షపతి, తండ్రి గోవర్ధన్ కళ్ల ముందే అందులో పడ్డాడు. చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ఆ ప్రయత్నంలో కొంత మట్టి కూడా బాలుడిపై పడినట్లు తెలిసింది. బోరుబావులను పూడ్చే లోపే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని మెదక్ ఆస్పత్రికి తరలించిన అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు.

First published: May 28, 2020, 7:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading