• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • THREE WOMEN WERE PARALYZED BY THE PRETENSE THAT THEY WERE DOING MAGIC BN

ఆ పని చేశారని ముగ్గురు మహిళను అర్ధనగ్నంగా ఊరేగించి.. మూత్రం తాగించి..

ఆ పని చేశారని ముగ్గురు మహిళను అర్ధనగ్నంగా ఊరేగించి.. మూత్రం తాగించి..

ప్రతీకాత్మక చిత్రం

మంత్రాలు చేస్తుందనే నెపంతో గ్రామస్తులంతా కలిసి వారిపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆ ముగ్గురు మహిళలను అర్ధనగ్నంగా గ్రామం మొత్తం ఊరేగించారు. ఆపై ఆ మహిళల చేత బలవంతంగా మూత్రం తాగించారు

  • Share this:
    రోజురోజూకీ ఆధునికత అందుబాటులోకి వస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. సాంకేతిక విప్లవంతో ఊహించని మార్పులతో కాలం దూసుకెళ్తుంటే.. కొంతమంది మాత్రం మూఢనమ్మకాలు.. మంత్రాలంటూ భయాందోళనల మధ్య గడుపుతున్నారు. తాజాగా బిహార్‌లో మంత్రాలు చేసిందనే నెపంతో మానవత్వం మంట కలిసిపోయిందనేలా.. ఓ ముగ్గురు మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించి.. బలవంతంగా వారి చేత మూత్రం తాగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లా దక్రమా గ్రామానికి చెందిన ఓ ముగ్గురు మహిళ మంత్రాలు చేస్తున్నారని గ్రామంలో పుకార్లు లేచాయి. ఈ క్రమంలోనే ఆ మహిళలు మంత్రాలు చేస్తుందనే నెపంతో గ్రామస్తులంతా కలిసి వారిపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆ ముగ్గురు మహిళలను అర్ధనగ్నంగా గ్రామం మొత్తం ఊరేగించారు.

    ఆపై ఆ మహిళల చేత బలవంతంగా మూత్రం తాగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ మహిళలపై దాడికి పాల్పడిన 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు డీఎస్పీ అమితేశ్ కుమార్ చెప్పారు. వీరిలో తొమ్మది మందిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు