Jagityala : ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిస్సింగ్... పోలీసుల అన్వేషణ...

అదృశ్యమైన ముగ్గురు మహిళలు

Jagityala : జగిత్యాల జిల్లాలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం రేపుతోంది..ఒకే రోజు ముగ్గురు కనిపించకుండా పోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.అదృశ్యం వెనక కారణాలు అన్వేషిస్తున్నారు.

  • Share this:
    కారణాలు తెలియకుండా ముగ్గురు మహిళలు అదృశ్యం అయ్యారు..దీంతో ఆ గ్రామంలో కలకలం రేగుతోంది..యుక్తవయస్సులో ఉన్నవారు ఎక్కడికి వెళ్లారనే అనుమానాలు వెలువడుతున్నాయి. దీంతో ముగ్గురు మహిళల కుటుంభ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు...

    జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది . మల్యాల మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన లక్ష్మి రూప , అదే గ్రామానికి చెందిన సూర్య కళ ... మానాల గ్రామంకు చెందిన సుమలత, ఒకే రోజు కనిపించకుండా పోయారు . దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు .

    ముగ్గురు మహిళలు ఒకే రోజు అదృశ్యం అవ్వడం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు . వీరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా .. ? లేదా వారే కావాలని ఎక్కడికైనా వెళ్లారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు . మిస్సైన ముగ్గురు మహిళల్లో .. ఒకరితో మరొకరి సంబంధం ఉందా అనే యాంగిల్ లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు . ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది . పోలీసులు కూడా కేసులను సవాల్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు . అద‌ృశ్యం అయినవారి ఆచూకి తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు . ఫోటోల్లో ఉన్న మహిళలు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గురువారం పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: