ఎన్నికల వేళ జగన్‌కు షాక్... అమెరికాలో వైసీపీ నేత అరెస్ట్...

కన్సల్టెన్సీ ద్వారా విద్యార్థులకు నకిలీ వీసాలు అందిస్తున్న ముగ్గురు ప్రవాస భారతీయుల్లో వైసీపీ నేత... నేరం రుజువైతే పదేళ్ల జైలు... భారీ జరిమానా పడే అవకాశం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 4, 2019, 7:46 PM IST
ఎన్నికల వేళ జగన్‌కు షాక్... అమెరికాలో వైసీపీ నేత అరెస్ట్...
వైఎస్ జగన్
  • Share this:
ఎన్నికల ప్రచారం హడావిడిలో బిజీగా ఉన్న వైసీపీ నేత జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా వీసా స్క్యామ్‌లో అరెస్ట్ అయిన ముగ్గురు వ్యాపారవేత్తల్లో వైసీపీ నేత కూడా ఉండడం జగన్‌ పార్టీ వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. కొన్నిరోజుల క్రితం అమెరికాలో నకిలీ వీసాల స్క్యామ్ పెను సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నకిలీ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి అమెరికా రావాలనుకునే భారతీయులకు నకిలీ స్టూడెంట్ వీసా ఇప్పిస్తోంది ఓ కన్సల్టెన్సీ. అమెరికా వెళ్లిన తర్వాత వీరి నుంచి కొద్దిమొత్తం వసూలు చేసి, వివిధ ఉద్యోగాలు చేస్తూ సెటిల్ చేయిస్తున్నారు కన్సెల్టీన్సీ నిర్వాహకులు. ఇలా చాలామంది భారతీయులు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు కూడా. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ స్క్యామ్‌ను గత నెల ప్రారంభంలో బట్టబయలు చేసిన అమెరికా అధికారులు... కన్సల్టెన్సీ ద్వారా విద్యార్థులకు నకిలీ వీసాలు అందిస్తున్న ముగ్గురు ప్రవాస భారతీయులను అరెస్ట్ చేశారు. కిశోర్ దత్తపురం, కుమార్ అశ్వపతి, సంతోష్ గిరి... నకిలీ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి, అమెరికా రావాలనుకుంటున్న తెలుగు విద్యార్థులకు నకిలీ స్టూడెంట్ వీసా ఏర్పాటుచేస్తున్నారు వీరు. ఈ ముగ్గురిలో కుమార్ అశ్వపతి... వైఎస్ఆర్ సీపీ ఎన్నారై విభాగంలో కీలక సభ్యుడిగా వ్యవహారిస్తున్నాడు. శాంతాకార్లా ఏరియాలో ‘నానోసెమాంటిక్స్ ఇన్ కార్పొరేషన్’ పేరుతో కన్సల్టీన్సీ ప్రారంభించిన ఈ ముగ్గురు తెలుగువాళ్లు... 2012 నుంచి నకిలీ స్టూడెంట్ వీసాలతో భారతీయులను అమెరికాకు రప్పిస్తున్నారు. ఈ స్క్యామ్ గురించి సమాచారం అందిస్తున్న అమెరికా అధికారులు... ఓ నకిలీ యూనివర్సిటీ పెట్టి అడ్మిషన్స్ అహ్వానించారు. ఈ యూనివర్సిటీ క్లాసులు జరగవు, పరీక్షలు ఉండవు. కేవలం ఇందులో చేరిన విద్యార్థులకు స్టూడెంట్ వీసా తీసుకునేందుకు ఉపయోగపడే ‘నామమాత్రపు యూనివర్సిటీ’ ఇది. ఈ విషయం తెలియని ‘నానోసెమాంటిక్స్ ఇన్ కార్పొరేషన్’ నిర్వాహకులు... ఈ యూనివర్సిటీ పేరు మీద దాదాపు 150 మంది విద్యార్థలకు హెచ్1బి వీసాలు ఏర్పాటు చేశారు.

పక్కా ఆధారాలతో స్క్యామ్‌ను బట్టబయలు చేసిన ఇమిగ్రేషన్ అధికారులు... విద్యార్థులతో పాటు కన్సల్టెన్స్ నిర్వాహాకులను మార్చి 27న అరెస్ట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి తిరిగి పంపించేయగా... కన్సల్టెన్సీ ముసుగులో వీసా మోసాలకు పాల్పడిన ముగ్గురిపై విచారణ జరుగుతోంది. ముగ్గురినీ వేర్వేరు న్యాయస్థానాల్లో హాజరుపర్చిన అధికారులు... మేలో మరోసారి కోర్టుకు తీసుకురాబోతున్నారు. నకిలీ వీసాలు ఏర్పాటుచేసిన వీరికి నేరం రుజువైతే అక్కడి చట్టాల ప్రకారం పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.5 లక్షల డాలర్లు (దాదాపు కోటి 72 లక్షల రూపాయలు) జరిమానా పడనుంది. NRI వైసీపీలో కీలక సభ్యుడిగా ఉంటున్న కుమార్ అశ్వపతి, గత ఎన్నికల్లో అమెరికాలోని తెలుగువారి దగ్గర జగన్ పార్టీ కోసం విసృత్తంగా ప్రచారం నిర్వహించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని కూడా ఘనంగా నిర్వహించాడు.
Published by: Ramu Chinthakindhi
First published: April 4, 2019, 4:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading