• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • THREE TEENAGERS GANG RAPE A GIRL IN HYDERABAD BN

హైదరాబాద్‌లో దారుణం.. మతిస్థిమితం సరిగా లేని బాలికపై సామూహిక అత్యాచారం..

హైదరాబాద్‌లో దారుణం.. మతిస్థిమితం సరిగా లేని బాలికపై సామూహిక అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

యువకులు అక్బర్, జుమన్, అలీం, గయాజ్‌లు బాలికను సమీపంలోని ఓ పాడుబడిన నిర్మాణంలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు.

  • Share this:
    హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. మతిస్థిమితం సరిగా లేని ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతమిది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన మతిస్థిమితం సరిగాలేని బాలిక(14) ఈనెల 20 నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని రోడా మేస్త్రీనగర్‌లో బాలిక నడుచుకుంటూ వెళుతోంది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన యువకులు అక్బర్, జుమన్, అలీం, గయాజ్‌లు బాలికను సమీపంలోని ఓ పాడుబడిన నిర్మాణంలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి సమయంలో సదరు బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. దీంతో కుటుంబ సభ్యులు దుండిగల్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా రెండు గంటల అనంతరం దేవేందర్ నగర్‌లో బాధితురాలిని గుర్తించారు. పోలీసులను చూసి నిందితులను పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు