Home /News /crime /

THREE TEENAGE GIRLS IN NEPAL FOUND DEAD HANGING FROM A TREE PVN

Girl dead bodies : బోర్డర్ లో కలకలం..చెట్టుకు వేలాడుతూ అమ్మాయిల డెడ్ బాడీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Girls found dead hanging from a tree :  సరిహద్దులో ముగ్గురు అమ్మాయిల డెడ్ బాడీలు ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించడం సంచలనంగా మారింది. వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

Girls found dead hanging from a tree :  సరిహద్దులో ముగ్గురు అమ్మాయిల డెడ్ బాడీలు ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించడం సంచలనంగా మారింది. వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన ఇండియా-నేపాల్‌ సరిహద్దుల్లోని(India-Nepal Border) నేపాల్ లోని జాపా(Jhapa)జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ రేగు చెట్టు ఉరివేసుకుని వేలాడుతూ ముగ్గురు మైనర్లు కనిపించారు. ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. అయితే వారిది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభినట్టు తెలిపారు. అయితే చనిపోయిన ముగ్గురు మైన్లర్లని కరీనా గణేష్‌(16), కల్పనా గణేశ్‌(16), అంజలి గణేశ్‌(17)గా గుర్తించారు. ఈ ముగ్గురు శనివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయారని స్థానిక డీఎస్పీ బసంత పాఠక్ తెలిపారు. ముగ్గురూ సుంకోషి టీ గార్డెన్ లో పనిచేసేవారని తెలిపారు. నేపాల్-భారత్ సరిహద్దుకు సమీపంలో పాతమరి గ్రామం దగ్గర ఉన్న తేయాకు తోటలోని రేగు చెట్టుకు వేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయని తెలిపారు. ఇది ఆత్మహత్య కేసు అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, అయితే, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.


మరోవైపు,తెలంగాణలో కేవలం తనకు ఆర్దికంగా సాయం చేయలేదనే కోపంతో స్నేహితుడి ప్రాణం తీశాడు. నమ్మశక్యంగా లేని ఈ వార్త జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్నేహం ముసుగులో జరిగిన హత్యను చేధించడానికి పోలీసులకు రెండున్నర నెలలు పట్టింది. బైక్ ఆధారంగా మర్డర్ కేసులో మిస్టరీ చేధించారు పోలీసులు.

Elon Musk Affairs : గూగుల్ సహ వ్యవస్థాపకుడి భార్యతో ఎఫైర్ పై స్పందించిన ఎలాన్ మస్క్!

జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని చిన్నపాడుకు చెందిన 24ఏళ్ల సాయికుమార్ గద్వాల పట్టణానికి చెందిన శ్రీకాంత్ క్లోజ్ ఫ్రెండ్స్. రోజూ వెళ్లినట్లుగానే మే 13వ తేదీన సాయికుమార్ ఇంటి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెదికినా సాయికుమార్‌ ఆచూకీ లభించకపోవడంతో సాయికుమార్ తండ్రి నర్సింలు జూలై 3వ తేదీన ధరూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేవులపల్లి సమీపంలో చేపల దుకాణం దగ్గర చిన్నపాడు గ్రామస్తులకు చనిపోయిన సాయికుమార్ బైక్ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే విషయంపై రేవులపల్లికి ద్విచక్ర వాహనం ఉన్న రేవులపల్లికి చెందిన వ్యక్తిని అదుపులో తీసుకొని ప్రశ్నించగా గద్వాలకు చెందిన శ్రీకాంత్ ద్విచక్ర వాహనం కుదువ పెట్టి కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడని సదరు వ్యక్తి పోలీసులకు విచారణలో తెలిపాడు. రెండ్రోజుల క్రితం శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించడంతో సాయికుమార్ ను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.హత్య జరిగిన తీరుపై పోలీసులు వివరాలు రాబట్టారు. హత్యకు ముందు ఇద్దరు కలిసి అదే ప్రాంతంలో కూర్చుని మద్యం త్యాగాలని తన అవసరాలకు 20వేల రూపాయలు అప్పుగా ఇవ్వాలని శ్రీకాంత్ సాయి కుమార్‌ను అడిగాడు. అందుకు సాయికుమార్‌ నిరాకరించడంతో తాగిన బీర్ సీసాను పగలగొట్టి గొంతులో దింపాడు. అటుపై సాయికుమార్‌ మృతదేహాన్ని పక్కనే ఉన్న గుంటలో వేసి పైన మట్టి రాళ్లు కప్పి పెట్టినట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు నిందితుడు. ఆదివారం శ్రీకాంత్ ను పోలీసులు ర్యాలంపాడు జలాశయం వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని పాచిపెట్టిన స్థలాన్ని గుర్తించారు రెవిన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు దాదాపు రెండున్నర నెలల క్రితం ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు కుళ్ళిపోయి ఉండడంతో మృతుడి అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Dead bodies, India, Nepal

తదుపరి వార్తలు