కెనడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి

ఈ ఏడాది ప్రారంభంలోనే వీరు ముగ్గురు కెనడా వెళ్లినట్టు తెలుస్తోంది. మృతి వార్త తెలిసి వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనకు కారణాలపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.

news18-telugu
Updated: October 7, 2019, 5:32 PM IST
కెనడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
ప్రమాదానికి గురైన కారు
news18-telugu
Updated: October 7, 2019, 5:32 PM IST
కెనడాలోని ఒంటారియోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌లోని పంజాబ్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ఆయిల్ హెరిటేజ్ అనే రోడ్డు మార్గంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.మృతి చెందిన విద్యార్థులను తన్వీర్ సింగ్,గుర్వింద్,హర్పీత్ కౌర్‌గా గుర్తించారు.కెనడాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఈ ముగ్గురి వయసు 20ఏళ్లకు కాస్త అటు-ఇటుగా ఉంటుందని సమాచారం.ఈ ఏడాది ప్రారంభంలోనే వీరు ముగ్గురు కెనడా వెళ్లినట్టు తెలుస్తోంది. మృతి వార్త తెలిసి వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనకు కారణాలపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.


First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...