హోమ్ /వార్తలు /క్రైమ్ /

School Girls Missing: ఇంటి నుంచి ముగ్గురు విద్యార్థినులు పరార్.. భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధమైన ఇద్దరు అమ్మాయిలు..!

School Girls Missing: ఇంటి నుంచి ముగ్గురు విద్యార్థినులు పరార్.. భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధమైన ఇద్దరు అమ్మాయిలు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

School Girls Missing: ఈ ముగ్గురు అమ్మాయిలు స్కూల్‌లో తమ సమస్యల గురించి తరచూ మాట్లాడుకునేవారు. వారు చివరికి పారిపోయి సొంతంగా జీవితాలను గడపాలని నిర్ణయించుకున్నారు. చదువులు, పేదరికాన్ని సాకుగా చూపి స్నేహితులు, ఇతర వారి వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకుని చెన్నైకి పారిపోయారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మైండ్ మెచూరిటీ సరిగా లేని మైనర్స్‌ ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకొని చిక్కుల్లో పడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎందరో చిన్నారుల కథ విషాదాంతమైంది. అయితే ఇటీవల కర్ణాటక (Karnataka)కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఇంట్లో నుంచి పారిపోయి పెద్ద తప్పు చేశారు. అదృష్టవశాత్తు, ఏ ఘోరం జరగకముందే పోలీసులు వారిని కనిపెట్టి తిరిగి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దాంతో వీరి కథ సుఖాంతం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు బెంగళూరు (East Bengaluru)లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు, 10వ తరగతి చదువుతున్న మరో బాలికతో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. సెప్టెంబర్ 6న వీరు ఆచూకీ లేకుండా అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

* ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య

వీరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈమె తండ్రి చాలా కఠినంగా ఉంటాడు. స్నేహితులతో గాలి తిరుగుళ్లు తిరగకుండా బాగా చదువుకోవాలని నిత్యం తిడుతూ ఉంటాడు. ఈ బాలిక కుటుంబం మురికివాడలో నివసిస్తోంది. మిగిలిన ఇద్దరు బాలికలు హాస్టల్‌లో ఉంటున్నారు. వారిలో ఒకరు తన తల్లిని కోల్పోయారు.

ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ సవతి తల్లికి తనంటే ఇష్టం లేదని, అందుకే చంపేయాలని భర్తను కోరిందని చర్చిలోని ఒక ఫాదర్ ద్వారా ఆమె తెలుసుకుంది. ఆపైన చాలా భయపడిపోయిన ఆ బాలిక ఇంటి నుంచి పారిపోవాలని ఒక ప్లాన్ వేసుకుంది. ఇక మూడో అమ్మాయి తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది.

ఈ ముగ్గురు అమ్మాయిలు స్కూల్‌లో తమ సమస్యల గురించి తరచూ మాట్లాడుకునేవారు. వారు చివరికి పారిపోయి సొంతంగా జీవితాలను గడపాలని నిర్ణయించుకున్నారు. చదువులు, పేదరికాన్ని సాకుగా చూపి స్నేహితులు, ఇతర వారి వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకుని చెన్నైకి పారిపోయారు.

అక్కడ చెన్నై పోలీసులను ఎవరు మీరు అని ప్రశ్నించగా, తాము ఓ పని నిమిత్తం ఇక్కడికి వచ్చామని, త్వరలో బెంగళూరుకు తిరిగి వెళ్లిపోతామని బాలికలు చెప్పారు. దీంతో చెన్నై పోలీసులు వారిని రైలులో బెంగళూరుకు పంపించారు. అయితే వారు నగరానికి తిరిగి వచ్చాక, రైల్వే స్టేషన్‌లో తమ ఫొటోలతో అంటించిన పోస్టర్లు కనిపించాయి. దాంతో భయపడిపోయిన వారు తిరిగి చెన్నైకి బయలుదేరారు.

* ఎలా దొరికారు?

చెన్నైలో ఒక వీధిలో వీరిని చూసి ఒక వ్యక్తి జాలి చూపించాడు. తాము అనాథలమని, హాస్టల్‌లో చిత్రహింసలకు గురి చేస్తుండటంతో పారిపోయి బయటకు వచ్చామని బాలికలు అతడితో చెప్పారు. దాంతో ఆ వ్యక్తి వారిని చెన్నైలోని ఓ చర్చి నిర్వహిస్తున్న హాస్టల్‌లో ఉంచారు. వారికి గ్రైండర్ పార్ట్స్ ప్యాకింగ్ యూనిట్‌లో ఉద్యోగాలు కూడా ఇప్పించారు.

ఇది కూడా చదవండి : ప్రపంచంలో పది భయంకరమైన ప్రదేశాలు.. చుచ్చు పోసుకోవాల్సిందే..!

ఈ క్రమంలో పనికి రాగానే ఓ అమ్మాయి ఫోన్ కొని తండ్రికి మిస్డ్ కాల్ ఇచ్చింది. తిరిగి కాల్ చేస్తే ఆ బాలిక ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ ఏం మాట్లాడలేదు. అతను మళ్లీ కాల్ చేస్తే ఆ కాల్స్‌ను లిఫ్ట్ చేయలేదు. దాంతో కాల్ చేసింది తన కూతురేనని అనుమానించి పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు ఆమెను వెతికి పట్టుకోవడంలో సఫలమయ్యారు. మిగిలిన ఇద్దరు బాలికలు ఆ తర్వాత దొరికారు. ఇన్‌స్పెక్టర్ కిరణ్ పి.బి నేతృత్వంలోని పులకేశినగర్ పోలీసులు సెప్టెంబర్ 23న చెన్నైకి వచ్చి వారిని పట్టుకోగలిగారు.

* పెళ్లి చేసుకోవాలని ప్లాన్

ఇందులోని ఇద్దరు విద్యార్థినులు ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే తాము అందవిహీనంగా ఉన్నామని, నిరుపేదలమని, తమను ఏ అబ్బాయి కూడా పెళ్లి చేసుకోరని అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని, భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధమయ్యారని తెలియడంతో పోలీసులు, తల్లిదండ్రులు షాక్ అయ్యారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Chennai, Crime news, Karnataka, National News

ఉత్తమ కథలు