హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్​ను ఢీకొట్టిన టవేరా.. ముగ్గురు దుర్మరణం 

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్​ను ఢీకొట్టిన టవేరా.. ముగ్గురు దుర్మరణం 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ టవేరా వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు.

జనగామ (Janagama) జిల్లాలో ఆదివారం రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఓ టవేరా వాహనం అదుపుతప్పి(Tavera vehicle overturned) డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టవేరాలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అటుగా వెళ్తున్నవారు.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ (Traffic) స్తంభించగా.. పోలీసులు టవేరాను రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటన (Tavera vehicle overturned and collided with a divider)పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో టవేరాలో 8 మంది ఉన్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

37 మందితో వెళుతున్న వాహనం..

అంతేకాకుండా  మరో ఘటనలోహైదరాబాద్ (Hyderabad) శివారులోనూ  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 37మంది ప్రయాణికులో వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ప్రమాదం ఘోరంగా జరిగినప్పటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వ్యాన్ లోని 15మంది తీవ్రంగా గాయపడగా మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని గుల్బర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చెవేళ్ళ మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై వేగంగా వెళుతున్న వ్యాన్ ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. రోడ్డుపై పల్టీలు కొడుతూ ప్రమాదం ఘోరంగా జరిగినా ప్రాణానష్టం జరగలేదు.

ఎవరికీ ప్రాణాపాయం లేదని..

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడినవారంతా హైదరాబాద్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గుల్బార్గాకు వెళ్ళి తిరిగి వస్తుండగా మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్పటివరకు ఆనందంగా సాగిన వారి ప్రయాణం హాహాకారాలతో నిండిపోయింది. ఇటీవలె మంచిర్యాల (Manchiryala) జిల్లా కొత్తపల్లి (Kottapalli) మండలం చింతకుంట (Chintakunta)దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వెనుక నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బైక్‌పై ముగ్గురు యువకులు ఉన్నారు. అందులో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(Tuesday)మృతి చెందాడు.

మృతులు ముగ్గురు 20సంవత్సరాల లోపు వాళ్లే కావడం విశేషం. మృతుల్లో మహేష్(Mahesh)డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ (Lakshmipur)గ్రామానికి చెందిన తుర్పాటి రాజయ్య (Rajayya)నాగమణి(Nagmani)ఇద్దరు కూలీ పని చేసుకుంటూ కొడుకుని చదివిస్తున్నారు.

First published:

Tags: Road accident

ఉత్తమ కథలు