Home /News /crime /

THREE PEOPLE INCLUDE LECTURER HARASSED WOMAN BY WRITING HER MOBILE NUMBER ON PUBLIC TOILETS IN KARNATAKA AK

Women Number on Public Toilets: తనకు వస్తున్న ఫోన్ కాల్స్‌తో షాకైన 58 ఏళ్ల మహిళ.. వాళ్లకు ఇదేం పాడుబుద్ధి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Harassment on Woman: కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్, నియామకాల సమస్యలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

  ఒక్కోసారి కొందరు చేసిన పనుల గురించి తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. 58 ఏళ్ల మహిళ ఫోన్ నంబర్‌ను పబ్లిక్ టాయిలెట్లలో(Public Toilets) రాసి పెట్టారు కొందరు వ్యక్తులు. దీంతో ఆమెకు పలువురు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అసలు తన మొబైల్‌కు ఇలాంటి ఫోన్ కాల్స్ ఎందుకు వస్తున్నాయో ఆమెకు అర్థంకాలేదు. ఈ కేసుకు సంబంధించి ఒక లెక్చరర్‌తో(Lecturer) సహా ముగ్గురు వ్యక్తులను మంగళూరు(Manglore) పోలీసులు అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో బంట్వాళకు చెందిన ఎకనామిక్స్ లెక్చరర్ ప్రదీప్ పూజారి, బెల్తంగడికి చెందిన కళాశాల కరస్పాండెంట్ ప్రకాష్ షెనాయ్, హెబ్రీకి చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తారానాథ్ బిఎస్ శెట్టి ఉన్నారు.

  మైసూరు, మడికేరి, చిక్కమగళూరు, ముదిగెరె, బాలెహోన్నూరు, ఎన్‌ఆర్‌ పురా, శివమొగ్గతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్లు, బస్టాండ్‌ల గోడలపై నిందితులు మహిళ కాంటాక్ట్ నంబర్‌, ఈమెయిల్‌ అడ్రస్‌ను రాశారని పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు లైంగిక తోడు కావాలని కోరుతూ ఫోన్ కాల్స్ రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

  ఉపాధ్యాయురాలిగా సుమారు 31 ఏళ్ల అనుభవం ఉన్న బాధితురాలు పలు పుస్తకాలు రచించి రాష్ట్రస్థాయి అవార్డులు కూడా పొందింది. నిందితుడు బాధితురాలి సహోద్యోగులే కావడం గమనార్హం. కళాశాల ప్రిన్సిపాల్‌లకు, కళాశాల విద్యాశాఖలోని అధికారులకు గతేడాది నవంబర్‌, డిసెంబర్‌లో వందలాది పోస్ట్‌కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులు బాధితురాలికి వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశాలు కూడా పంపారు. అనేక మంది అజ్ఞాత వ్యక్తులు లైంగిక ప్రయోజనాలను కోరుతూ, అసభ్యకరమైన భాషలో మాట్లాడుతూ బాధితురాలికి 500 కంటే ఎక్కువ కాల్స్ చేశారు.

  ExtraMarital Affair: గుడి దగ్గరకి వెళ్లి కోడిని కోసుకుని రమ్మన్న భార్య.. ఆ తరువాత.. వనపర్తి జిల్లాలో దారుణం

  Mahabubabad: టీఆర్ఎస్‌ కౌన్సిలర్ మర్డర్..సినీ ఫక్కీలో గొడ్డలితో నరికి చంపిన ప్రత్యర్ధులు

  కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్, నియామకాల సమస్యలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కొంతమంది అనుమానితుల ట్రాక్ట్ రికార్డును తనిఖీ చేస్తున్నప్పుడు, మరుగుదొడ్డి గోడలపై బాధితుడి పోస్టర్లు అతికించిన ప్రదేశాలలో ఈ వ్యక్తులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news, Harassment on women

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు