Home /News /crime /

THREE PEOPLE HAVE BEEN DIED IN THREE CONSECUTIVE ACCIDENTS ON NATIONAL HIGHWAY 44 PASSING THROUGH ADILABAD DISTRICT ADB PRV

Adilabad: మృత్యుకూపంగా ఆ జాతీయ రహదారి.. మూడు రోజుల్లో ముగ్గురు మృతి.. చెక్​పోస్టుపై స్థానికుల దాడి

ఓ ప్రమాద దృశ్యం

ఓ ప్రమాద దృశ్యం

ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళుతున్న 44వ నెంబర్ జాతీయ రహదారి నెత్తురోడుతోంది. గత మూడు రోజులుగా వరుసగా జరిగిన మూడు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

    (కట్టా లెనిన్, న్యూస్ 18 ఆదిలాబాద్ ప్రతినిధి)

    ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళుతున్న 44వ నెంబర్ జాతీయ రహదారి (National Highway) నెత్తురోడుతోంది. గత మూడు రోజులుగా వరుసగా జరిగిన మూడు ప్రమాదాల్లో (Three Accidents) ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గతంలోనూ ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న జైనథ్ మండలం భోరజ్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా శుక్రవారం  పాఠశాలకు తన ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహిళా ప్రధానోపాధ్యాయులు ఏనుగు పద్మను చెక్ పోస్టు వద్ద లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తలకు హెల్మెట్ ఉన్నా ఆమె ప్రాణాలను నిలవలేదు. తాంసి మండలం జామిడికి చేందిన పద్మ బేల మండలంళోని హేటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే  విధులకు హజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై పాఠశాలకు బయలు దేరింది. ఇంతలోనే విధి చిన్నచూపు చూసి రోడ్డు ప్రమాదం రూపంలో ఆమె ప్రాణాలను బలిగొంది.

    చెక్​పోస్టుపై దాడి..

    ఇదే ప్రాంతంలొ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) 13 ఏళ్ల ఓ విద్యార్థిని సంఘటన స్థలంలోనే మృతిచెందగా, ఆమె తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. అంతకు ఒకరోజు ముందు కూడా ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో ఆయన మృతి చెందాడు. ఇలా వరుసగా మూడు రోజులుగా జరిగిన మూడు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. అయితే మహిళా ప్రధానోపాధ్యాయురాలి మరణంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తరుచు జరుగుతున్న ఈ ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పక్కనే ఉన్న ఆర్టీఓ, చెక్ పోస్టు (Check post) కార్యాలయంపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఫర్చీచర్ ధ్వంసం చేశారు. కిటికి అద్దాలను పగులగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

    భారీ వాహనాలను రహదారిపై నిలిపివేస్తుండటంతోనే..

    ఆర్టీఓ అధికారులు నిబంధనలకు విరుద్దంగా జాతీయ రహదారిపై భారీకేడ్లు ఏర్పాటు చేసి భారీ వాహనాలను రహదారిపై నిలిపివేస్తుండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతటితో ఆగకుండా జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. చెక్ పోస్టు సిబ్బంది నిర్లక్షమే ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపించారు. సరైన పద్దతిలో సర్వీసు రోడ్ల నిర్మాణం చేపట్టలేదని ఆందోళనకారులు విమర్శించారు.

    అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామి ఇచ్చేంత వరకు ఆందోళనను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఆర్డీఓ జాడి రాజేశ్వర్, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, రవాణా శాఖ డిప్యూటి కమిషనర్ డా. పుప్పాల శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు కూడా స్థానికులకు సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డా. పుప్పాల శ్రీనివాస్ స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హామి ఇచ్చారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Accident, Adilabad, Road accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు