దశదిన కర్మకు వెళ్లి మద్యం తాగారు.. కానీ కొన్ని నిమిషాల్లోనే ఘోరం.. ఆ ముగ్గురూ మృతి.. ఏం జరిగిందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

Khammam Triple Murders: చిన్నా స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పాత కక్షలతో మద్యంలో సైనైడ్ కలిపినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చిన్నా పోలీసుల అదుపులో ఉన్నాడు.

 • Share this:
  దశదిన కర్మకు హాజరైన బంధువులు.. ఇంట్లో కార్యక్రమాలు పూర్తయ్యాక పార్టీ చేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ మద్యం తాగారు. కానీ అంతలోనే ఘోరం జరిగింది. ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. మరో ఇద్దరు కూడా అక్కడే పడిపోయారు. వారిని ఆస్పత్రిలోకి తరలించే లోపే మరణించారు. ఖమ్మం జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాకు చెందిన బోడా హరిదాసు (60), బోడా మల్సూర్‌ (57), బోడా భధ్రు (30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన బోడా అర్జున్ మరణించాడు. శనివారం దశదిన కర్మ నిర్వహించారు. ఇంట్లో కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ ముగ్గురు మందు పార్టీ చేసుకున్నారు.

  బోడా చిన్నా అనే వ్యక్తి..  తండాలోని ఓ బెల్టు దుకాణంలో రెండు మద్యం సీసాలను కొనుగోలు చేసి మల్సూర్, భద్రుకు ఇచ్చాడు. ఆ తర్వాత మల్సూర్, భద్రు, హరిదాసు కలిసి మద్యం తాగారు. చిన్నా మాత్రం తాగలేదు. ఐతే మద్యం తాగిన కాసేపటికే ముగ్గురూ స్పృహ తప్పి పడిపోయారు. భద్రు అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన ఇద్దరిని చికిత్స కోంస ఖమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. చిన్నానే వారికి మద్యం ఇచ్చాడని.. అతడే ఏదో కలిపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  చిన్నా స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. పాత కక్షలతో మద్యంలో సైనైడ్ కలిపినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చిన్నా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఖమ్మం పీఎస్‌లో రిమాండ్‌లో ఉంచారు. ఈ ఘటన నేపథ్యంలో ఆదివారం చంద్రు తండాలో ఉద్రిక్తత నెలకొంది. మద్యంలో విషం కలిపిన చిన్నా ఇంటిపై మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు ఆరోపిస్తున్నట్లుగా చిన్నానే మద్యంలో విషం కలిపాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశముంది.

  ఇవి కూడా చదవండి:

  B Tech Student Murder: బీటెక్ విద్యార్థిని హత్యకు ముందు ఆ 8 నిమిషాలు ఏం జరిగింది?

  అతడికి 45 ఏళ్లు.. టీవీ కనెక్షన్ లేక పక్కింటికి వెళ్లిన 6 ఏళ్ల బాలికపై  అఘాయిత్యం
  Published by:Shiva Kumar Addula
  First published: