హోమ్ /వార్తలు /క్రైమ్ /

Child Harassment: వీళ్లు మనుషులా..? పశువులా..? చిన్నారికి ఇలాంటి నిజాయితీ పరీక్ష పెడతారా..?

Child Harassment: వీళ్లు మనుషులా..? పశువులా..? చిన్నారికి ఇలాంటి నిజాయితీ పరీక్ష పెడతారా..?

కేరళాకు శ్రీకందపురానికి చెందిన సతీష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తన కొడుకు గొంతు కోసి హతమార్చారడు ఇదే సమయంలో అడ్డుకునేందుకు వెళ్లిన భార్య అంజు సైతం గాయాల పాలైంది.

కేరళాకు శ్రీకందపురానికి చెందిన సతీష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తన కొడుకు గొంతు కోసి హతమార్చారడు ఇదే సమయంలో అడ్డుకునేందుకు వెళ్లిన భార్య అంజు సైతం గాయాల పాలైంది.

Child Harassment: ఏదైనా తప్పు చేసినట్లు ఆరోపణలు మోపిన వారు నీటిలో నిర్ణీత సమయం పాటు ఉండగలిగి ప్రాణాలతో బయటకు వస్తే.. వారు ఎలాంటి తప్పు చేయనట్లు భావిస్తారు. ఒకవేళ అంతకంటే ముందే నీటి నుంచి పైకి లేస్తే, తప్పు చేసినట్లే లెక్క.

దొంగతనం చేయలేదని నిరూపించుకోవడానికి.. ఒక బాలుడితో బాగా కాల్చిన గొడ్డలిని నాకించారు ముగ్గురు దుర్మార్గులు. ఈ విషయం స్థానిక మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. తెహసీబ్ అనే గొర్రెలు కాసే పిల్లాడు టీ కాచే కెటిల్ దొంగతనం చేసినట్లు ఈ ముగ్గురు ఆరోపించారు. ఆ దొంగతనం తాను చేయలేదని వాదించాడు తెహసీబ్. అయితే నిజాయతీ నిరూపించుకోవడానికి అప్పుడే కాల్చిన ఇనుప గొడ్డలిని నాలుకతో తాకాలని వీరు డిమాండ్ చేశారు. వారి బలవంతంతో ఆ కుర్రాడు గొడ్డలికి నాలుక అంటించాడు. ఈ దారుణం దాయాది దేశం పాకిస్థాన్ లో జరిగింది.దీంతో అతడి నాలుకకు తీవ్రమైన గాయాలయ్యాయి. కాలిన గాయాలతో బాధపడుతున్న బాలుడు, ప్రస్తుతం స్థానిక తెహసిల్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయంపై తెహసీబ్ తండ్రి జాన్ ముహమ్మద్ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం దారుణానికి పాల్పడిన సిరాజ్, అబ్దుల్ రహీమ్, ముహమ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : దీపక్ పునియా ఓటమి తర్వాత రిఫరీ రూమ్ కి వెళ్లి భారత కోచ్ వీరంగం.. ఆ తర్వాత ఏమైందంటే..

బలోచ్ ప్రాంతానికి చెందిన గిరిజనులు ఇంకా తాము నిర్దోషులమని నిరూపించేందుకు నీరు లేదా నిప్పు పద్ధతినే వాడుతుంటారు. ఏదైనా తప్పు చేసినట్లు ఆరోపణలు మోపిన వారు నీటిలో నిర్ణీత సమయం పాటు ఉండగలిగి ప్రాణాలతో బయటకు వస్తే.. వారు ఎలాంటి తప్పు చేయనట్లు భావిస్తారు. ఒకవేళ అంతకంటే ముందే నీటి నుంచి పైకి లేస్తే, తప్పు చేసినట్లే లెక్క. అంతే కాదు.. నిర్దోషిగా ఉన్న వ్యక్తి నిప్పును నాలుకతో తాకినా అతడికి ఏమీ కాకూడదు. ఒకవేళ ఏదైనా అయితే అతడు తప్పు చేసినట్లే భావిస్తారు. ఆ తరువాత వారికి శిక్ష విధిస్తారు.


పాకిస్థాన్‌లో ఇలాంటి కేసులు ఎన్నో వెలుగుచూశాయి. చిన్నపిల్లలపై లైంగిక, శారీరక హింస, కిడ్నాప్‌లు, బాల్య వివాహాలు వంటివి సహజం. ఆ దేశంలో ప్రతి రోజు సగటున ఎనిమిది మంది చిన్నారులైనా హింసకు గురి కావడం చూడవచ్చు. అయితే పిల్లల రక్షణ కోసం ఏర్పడిన సంస్థలు వారికి సాయం చేస్తూనే ఉంటాయి.

First published:

Tags: Children, Crime news, Pakistan

ఉత్తమ కథలు