Home /News /crime /

THREE MINOR GIRLS DEATH MISTRY HAS FIND OUT BY POLICE WHOSE DEAD BODIES WERE FOUND IN LAKE IN NIRMAL IN THE MONDAY VRY ADB

Nirmal : సెల్ఫీ సరదా... ముగ్గురి ప్రాణాలు తీసిందా....? యువతుల మృతిపై వీడిన మిస్టరీ...!

Nirmal : సెల్ఫీనే.. ముగ్గురి ప్రాణాలు తీసిందా....? ముగ్గురు యువతుల మృతిపై వీడిన మిస్టరి..!

Nirmal : సెల్ఫీనే.. ముగ్గురి ప్రాణాలు తీసిందా....? ముగ్గురు యువతుల మృతిపై వీడిన మిస్టరి..!

Nirmal :సోమవారం ఉదయం నిర్మల్ జిల్లాలోని చెరువులో తేలిన ముగ్గురు అమ్మాయిల మృతదేహాలపై మిస్టరీ వీడింది..సరదా కోసం వెళ్లిన అమ్మాయిలు నీటి గుంతలో సెల్ఫీ దిగడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు నిర్దారణకు వచ్చారు. తమ కళ్లముందే కలిసి తిరిగిన ముగ్గురు ఆడపిల్లలు ఒక్కసారిగా ఆదృశ్యమై శవాలుగా తేలడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది..

ఇంకా చదవండి ...
    నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గావ్‌ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెల్లతోపాటు వారి సమీప బంధువు చెరువులో శావాలుగా తేలారు. ఆదివారం ఉదయం ఇద్దరు సునిత, వైశాలి అనే ఇద్దరు అక్కా చెల్లెల్లు కాగా అంజలి అనే అమ్మాయితో కలిసి వెళ్లి సింగన్‌గావ్‌ సమీపంలోని చెరువులో శవాలుగా తేలారు.

    ఉదయం గ్రామస్థులు పోలీసులు సమాచారం అందించడంతో మృతదేహాలను వెలికి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టంకు పంపించారు. అయితే పోలీసులు మాత్రం ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదవశాత్తు చెరువులో సెల్ఫీ దిగేందుకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

    ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు వివరాలు వెళ్లడించారు. మృత్యువాత పడిన ముగ్గురు బాలికలు ఆదివారం మధ్యాహ్నాం పిక్‌నిక్ కోసం ఆహార పదార్థాలు తీసుకుని తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అయితే ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో సునిత తల్లి మంగళబాయి ముగ్గురిని ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని చెప్పింది. దీంతో అక్కడి నుండి వెనుదిరిగిన యువతులు మధ్యలో ఆగి, తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలు తిన్నారు. అనంతరం సెల్ఫీలు దిగారు. అదే సెల్ఫీలను సమీపంలోని చెరువు కుంటలోకి వెళ్లి దిగేందుకు వెళ్లారు.చెరువు కుంటకు వెళ్లిన వారు తిరగి రాలేదు.

    దీంతో ఆందోళన చెందిన కుటంబసభ్యులు మరోసారి చెనువద్దకు వెళ్లి వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో...పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది... అయితే ఉదయమే సింగాన్‌గావ్ చెరువులో శవాలు తేలయాన్న సమాచారంతో పోలీసులు వచ్చినట్టు వివరించారు. మృతిపై పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Nirmal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు