Home /News /crime /

THREE MINOR BOYS ARRESDED FOR REPEATED SEXUAL ABUSE ON 9 YEAR OLD BOY IN TAMIL NADU MKS

Sexual Assault: 9ఏళ్ల బాలుడిపై ముగ్గురు టీనేజర్ల లైంగికదాడి.. పోర్న్ వీడియోలు చూపిస్తూ అలా చేయాలని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్ లైన్ క్లాసుల బదులు పోర్న్ వీడియోలు చూస్తూ ఉద్రేకం చెందిన ముగ్గురు టీనేజర్లు.. తమ వీధిలోని ఓ 9ఏళ్ల బాలుడిపై లైంగిక అకృత్యానికి పాల్పడిన ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. నెలన్నర పాటు సాగిన రేప్ ఉదంతంతో చిన్నపిల్లాడు షాక్ కు గురై, ఆస్పత్రిపాలయ్యాడు..

ఇంకా చదవండి ...
కరోనా విలయంలో ఆన్ లైన్ క్లాసుల కారణంగా దాదాపు పిల్లలందరూ మొబైల్ ఫోన్లను వాడాల్సిన పరిస్థితి. అయితే మంచీచెడులు తెలీని వయసులో వారిలో కొందరు విపరీత పోకడలకు పోతున్నారు. ఆన్ లైన్ క్లాసుల బదులు పోర్న్ వీడియోలు చూస్తూ ఉద్రేకం చెందిన ముగ్గురు టీనేజర్లు.. తమ వీధిలోని ఓ 9ఏళ్ల బాలుడిపై లైంగిక అకృత్యానికి పాల్పడిన ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. నెలన్నర పాటు సాగిన రేప్ ఉదంతంతో చిన్నపిల్లాడు షాక్ కు గురై, ఆస్పత్రిపాలు కాగా, నాటకీయ పరిణామాల మధ్య అసలు విషయం వెల్లడైంది. ఈ ఘోరానికి సంబంధించి కోవిల్ పట్టి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితులైన ముగ్గురు టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి..

చిన్న పిల్లలపై లైంగిక అకృత్యాలకు సంబంధించి అసాధారణ ఘటన ఒకటి తమిళనాడులో వెలుగుచూసింది. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లైంగిక ఉదంతంలో బాధితుడు 9 ఏళ్ల బాలుడు కాగా, ముగ్గురు నిందితులు టీనేజర్లే కావడం గమనార్హం. కోవిల్ పట్టిలో స్థానిక ప్రైవేటు స్కూల్లో ఎనిమిదో తరగతి చదివే ఇద్దరు పిల్లలకు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ బాలుడు స్నేహితులు. ఈ ముగ్గురికీ పోర్న్ వీడియోలు చూడటం అలవాటు. ప్రస్తుతం కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండగా, క్లాసులకు మస్కాకొట్టి మరీ పోర్న్ చూసేవాళ్లు. ఆన్ లైన్లో ఒకరికొకరు వీడియోలు పంపుకొనేవారు. ఈ క్రమంలో వారి కన్ను అదే వీధిలో నివసించే 9ఏళ్ల బాలుడిపై పడింది.

Lockdown : ఏపీలో కరోనా ఒమిక్రాన్ విలయం.. లాక్‌డౌన్ విధింపు దిశగా YS Jagan సర్కార్?


ఇంటి దగ్గర ఆడుకుంటోన్న బాలుణ్ని పక్కకు పిలిచి, ఇరుకుగా ఉన్న, నిర్మానుష్యమైన ఓ సందులోకి తీసుకెళ్లిన ముగ్గురు టీనేజర్లు.. ఆ పిల్లాడికి పోర్న్ వీడియోలు చూపించి.. అచ్చం అలాగే చేయాలని బెదిరించేవారు. ఒక దశలో ముగ్గురూ కలిసి జుగుప్సాకరమైన రీతిలో చిన్న పిల్లోడిపై లైంగిక దాడి చేశారు. ఒకటీ రెండు కాదు, నెలన్నర రోజులపాటు ఈ వికృతపర్వం కొనసాగింది. స్కూల్లో సీనియర్ అన్నలు తన పట్ల ఏం చేస్తున్నారో అర్థంకాక ఆ చిన్నారి షాక్ లోకి వెళ్లిపోయింది. వరుస లైంగికదాడుల తర్వాత ఆ బాలుడు ఇంట్లో నుంచి బయటికి రావడం మానేశాడు..

Parosmia : మీ పిల్లలు సరిగా తినడంలేదా?.. Post Covid లక్షణం పారోస్మియా కావొచ్చు..ఏం చేయాలంటే..


అప్పటిదాకా బయటికి వెళ్లి ఆడుకునే పిల్లాడు కాస్తా బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడపడటమేకాదు, అన్నం తినడం పూర్తిగా మానేశాడు. రోజులపాటు ఒక్క మెతుకూ తినకపోవడంతో చివరికి ఆస్పత్రిపాలయ్యాడు. అక్కడ బాలుడి పరిస్థితిని గమనించిన వైద్యులు.. సైకియాట్రిస్టును పిలిపించి మాట్లాడించారు. కౌన్సిలింగ్ తర్వాత ఆ బాలుడు తనకు జరిగిన ఉదంతం మొత్తాన్ని తల్లికి వివరించాడు.

Burkina Faso: సర్కారుపై సైనిక తిరుగుబాటు.. దేశంలో కల్లోలం.. అధ్యక్ష భవనంపైనా కాల్పుల మోత


అతను చెప్పిన నమ్మశక్యంకాని విషయాలు తల్లిదండ్రులకు షాక్ కలిగించాయి. డాక్టర్ల సూచన మేరకు చివరికి ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి 9ఏళ్ల బాలుడిపై లైంగిక అకృత్యానికి పాల్పడిన ముగ్గురు టీనేజర్లపై కేసులు పెట్టామని, వాళ్లను అదుపులోకి తీసుకుని స్టేట్ హోంకు తరలించామని కోవిల్ పట్టి పోలీసులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: Minor rape, School boy, Sexual harrassment, Tamil nadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు