• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • THREE MEN RAPED A 13 YEARS MINOR GIRL IN MEDAK DISTRICT VB MDK

Rape on minor: 13 ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారం.. ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు తల్లిదండ్రులు నిలదీయడంతో ఆ బాలిక..

Rape on minor: 13 ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారం.. ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు తల్లిదండ్రులు నిలదీయడంతో ఆ బాలిక..

ప్రతీకాత్మక చిత్రం

Rape on minor: దేశంలో మహిళలు, చిన్నారులు అత్యాచారాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కామంతో కళ్లుమూసుకుపోయిన మృగాళ్లు విచక్షణ మరిచి మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికను ముగ్గురు మృగాళ్లు అత్యాచారం చేశారు.

  • Share this:
    (కె. వీరన్న, మెదక్ జిల్లా, News18 తెలుగు)

    చట్టాలు వారికి చుట్టాలుగా మారుతున్నాయి. ఎంత నేరం చేసినా డబ్బులు ఉంటే చాలు వెంటనే బయటపడొచ్చు అనే ఆలోచనలతో ఉన్నారు.  అత్యాచారాలు, హత్యలు చేయడం.. మూడు రోజులు పోలీస్ స్టేషన్ ఉండటం.. ఎంతో కొంత మామూళ్లు ఇవ్వడం.. బయటపడం. ఇది డబ్బు ఉన్న వాళ్లు ఆడే నాటకం. తాజాగా 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్ రేప్ చేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీస్ లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగి నాలుగు రోజలు అవుతున్నా ఇంతవరకు వారిపేర్లను భయటకు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. నిందితుల వద్దనుండి డబ్బులు తీసుకొని ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో నిందితులను అదుపులోకి తీసుకోకుండా వారి వద్ద నుండి భారీ మొత్తంలో పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందని వారు పేర్కొన్నారు. గత 15 రోజుల క్రితం అత్యాచారం చేసి చంపిన ఘటన లో నిందితులను తప్పుదారి పట్టించేందుకు వారి వద్ద నుండి పది లక్షల నుండి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ రేప్ కేసుల విషయంలో తొందరగా నిందితులను పట్టుకొని రిమాండ్ పంపాలని ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఖాకీలు డబ్బులు తీసుకొనే తీరు మాత్రం మారడం లేదంటున్నారు ప్రజాసంఘాల నేతలు. 13 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఉదయం ఎనిమిది గంటలకు సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండల పరిధిలోని దుంపకుంట సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఈ ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బాలిక ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీశారు. భయపడిపోయిన ఆ బాలిక ముగ్గురు వ్యక్తులు కలిసి నన్ను బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ జోగిపేటలో ఫిర్యాదు చేశారు.

    జోగిపేట పోలీస్ స్టేషన్


    ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా విచారణ కొనసాగతుందని వారికి సమాధానం చెబుతున్నారు. కానీ నిందితలు వద్ద లంచం తీసుకొని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు