THREE MEN BOOKED FOR TRYING TO KIDNAP A WOMAN IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN
Andhra Pradesh: భార్య ఉండగానే మరో యువతితో సహజీవనం... అసలు విషయం తెలిసి షాకైన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
ExtraMarital Affair : అతడికి పెళ్లైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతడి మరో అమ్మాయిపై మనసుపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఆమెను ప్రేమలోకి దించాడు. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యువతి.. అసలు విషయం తెలియక సహజీవనం కూడా చేసింది.
అతడికి పెళ్లైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతడి మరో అమ్మాయిపై మనసుపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఆమెను ప్రేమలోకి దించాడు. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యువతి.. అసలు విషయం తెలియక సహజీవనం కూడా చేసింది. అసలు విషయం తెలిసిన యువతి.. తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. దీంతో ఎలాగైనా ఆమెను తీసుకురావాలనుకున్న అతడు.. కిడ్నాప్ కు యత్నించాడు. గ్రామస్తులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన బత్తుల రవి.. అలియాస్ బుల్లెట్ రవికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు స్థానికంగా పత్తి, మిరప వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో నకరికల్లు మండలానికి చెందిన యువతితో పరిచయమైంది. ఇది ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఆరేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఐతే రవికి పెళ్లైన విషయం యువతికి తెలిసింది. దీనిపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో రవి.. యువతిని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. ఆమను తరచూ కొడుతుండటంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై మరింత కక్ష పెంచుకున్న రవి.. ఎలాగైనా ఆమెను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా ఈనెల 3వ తేదీ రాత్రి కారులో తన మిత్రులతో కలిసి యువతి ఉంటున్న గ్రామానికి వెళ్లాడు.
అర్ధరాత్రి ఆమెను బలవంతంగా తీసుకొచ్చి కారెక్కించేందుకు యత్నించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి రవితో పాటు మరో ఇద్దర్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అఫ్పగించారు. రవితో పాటు ఇనిమెళ్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్, రామిశెట్టి తిరుమలరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.