హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sangareddy family Suicide: సంగారెడ్డిలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య.. అసలేమైంది?

Sangareddy family Suicide: సంగారెడ్డిలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య.. అసలేమైంది?

సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య (family suicide) చేసుకున్నారు.

సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య (family suicide) చేసుకున్నారు.

సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య (family suicide) చేసుకున్నారు.

    (Veeranna, News18, Medak)

    సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య (family suicide) చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్‌ (27)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటన్ చెరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలని పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రేఖ బాసుదేవ్‌ల మధ్య వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.

    గత కొద్ది రోజుల క్రితం రేఖ భర్తకు మతిస్తిమితం లేకపోవడంతో రోడ్లపై అడుక్కుంటూ జీవిస్తున్నాడు. దీంతో రేఖ తన మరిదితో వివాహేతర సంబంధం (Extra marital affairs) కొనసాగించిందని అనుమానిస్తున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయో.. కానీ, ఇరువురితో పాటు ఓ పాపను కూడా తమతో మృత్యు ఒడిలోకి తీసుకెళ్లిపోయారు.  పటాన్చెరు డీఎస్పి భూమ్ రెడ్డిని న్యూస్ 18 వివరణ కోరగా.. ‘‘వారు వలస కూలీలు బతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగించేవారు. రేఖ భర్త గత కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం కోల్పోవడంతో తన వరుసకు మరిది అయినటువంటి బాసుదేవ్‌  వివాహేతర సంబంధం పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉందని ప్రాథమిక విచారణలో తేలింది”అని ఆయన తెలిపారు.

    ఉరేసుకున్న దృశ్యం

    కాగా, ఇటీవల తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరిగాయి.  సంగారెడ్డి జిల్లా (SangaReddy)ఆందోల్ పెద్ద చెరువు (pond)లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య (family suicide) చేసుకుంది. కుటుంబ కల హాలో.. ఆర్థిక ఇబ్బందులో తెలియదు కానీ, ఇలా కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది. అయితే భర్త ఇంట్లో ఉరేసుకుని (husband hang) చనిపోవడం.. భార్య పిల్లలు చెరువులో దూకి చనిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆందోల్ పెద్ద చెరువు (Andhol big pond)లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఇద్దరి మృతదేహాలు (dead bodies) లభ్యమయ్యాయి. మృతులు తల్లి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం వెతకగా మరో చిన్నారి మృతదేహం లభ్యమైంది. వీరిని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం (Ramachadhra puram) పోలీస్ పరిధి తెల్లాపూర్​లోని NEW MIG (BHEL) కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకాంత్​ భార్య, పిల్లలుగా (Chandrakant wife and children) గుర్తించారు పోలీసులు.

    గతంలో మేడ్చల్​లోనూ ఇలాగా జరిగింది ఓ ఇల్లాలు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య (Suicide attempt)కి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు. అయితే ఇద్దరు పిల్లలు, తల్లి మృత్యువాత పడ్డారు. తాను చనిపోతే పిల్లల్ని భర్త బాగా చూసుకోడనే ఉద్దేశంతో పిల్లలతో సహా చెరువులో దూకింది (with her three children jumped into a pond). ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృత్యువాతపడగా, ఐదేళ్ల పెద్ద కుమారుడు బతికి బయటపడ్డాడు.

    First published:

    Tags: Family suicide, Sangareddy

    ఉత్తమ కథలు