THREE MECHANICS MURDERED IN DICHPALLY BESIDE NATIONAL HIGHWAY NIZAMABAD POLICE YET TO FIND CAUSE MKS NZB
Nizamabadలో మళ్లీ మారణకాండ -పంజాబ్ వలస మెకానిక్ల దారుణహత్య -ఆ రాత్రి ఏం జరిగింది?
ఘటనాస్థలంలో పోలీసులు
డిచ్ పల్లిలోని హైవే పక్కనే నాగ్ పూర్ గేటు వద్ద హార్వెస్టర్ రిపేరింగ్ షెడ్డులో ఈ ఉదయం మూడు మృతదేహాలు కనిపించాయి. ఈ ముగ్గురూ హార్వెస్టర్ల డ్రైవర్, మెకానిక్ లుగా పనిచేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పంజాబ్ కు చెందినవారు కాగా, మరో వ్యక్తి జగిత్యాలకు చెందినవ్యక్తి. షెడ్డులో వీరు నిద్రమత్తులో ఉన్నపుడు ఎవరో పథకం ప్రకారం హత్య చేసిన ఉంటారని పోలీసులు ఆనుమానిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మళ్లీ మారణకాండ చోటుచేసుకుంది. మూడు నెలల కిందట మొహ్మద్ షారూఖ్ అలియాస్ జావేద్ అనే సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్టు చేసిన ఉదంతం తర్వాత మళ్లీ జిల్లా వాసులను ఉలిక్కిపాటుకు గురిచేస్తూ డిచ్పల్లి ట్రిపుల్ మర్డర్ వెలుగులోకి వచ్చింది. డిచ్పల్లిలో నేషనల్ హైవే పక్కనే ఉండే ప్రఖ్యాత హార్వెస్టర్ రిపేర్ సెంటర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన ముగ్గురిలో ఇద్దరు పంజాబ్ వలస కూలీలు కావడం, మరొకరు జగిత్యాల వాసి కావడంతో అసలేం జరిగిందో కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం నాడు వెలుగులోకి వచ్చిన ఈ ట్రిపుల్ మర్డర్ గురించి పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
నిజామాబాద్ డిచ్ పల్లిలో 44వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే నాగపూర్ గేట్ వద్ద హార్వెస్టర్ రిపేరింగ్ సెంటర్ ఉంది. వరి విస్తృతంగా సాగయ్యే జిల్లా కావడంతో నిజామాబాద్ లో హార్వెస్టర్ (వరి కోత) యంత్రాలకూ తక్కువేమీలేదు. వానాకాలం, యాసంగి పంటల కోతల సమయంలో దేశంలోని వివిద ప్రాంతాల నుంచి హార్వెస్టర్ యంత్రాలు, వాటితో పనిచేసేందుకు మనుషులూ కూలీలుగా వస్తుంటారు. ఇది కాకుండా యంత్రాలను బాగుచేయడానికి మెకానిక్ లు కూడా ఇతర ప్రాంతాల నుంచి రావడం పరిపాటి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ముగ్గురు మెకానిక్ లు దారుణ హత్యకు గురయ్యారు..
డిచ్ పల్లిలోని హైవే పక్కనే నాగ్ పూర్ గేటు వద్ద హార్వెస్టర్ రిపేరింగ్ షెడ్డులో ఈ ఉదయం మూడు మృతదేహాలు కనిపించాయి. ఈ ముగ్గురూ హార్వెస్టర్ల డ్రైవర్, మెకానిక్ లుగా పనిచేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పంజాబ్ కు చెందినవారు కాగా, మరో వ్యక్తి జగిత్యాలకు చెందినవ్యక్తి. షెడ్డులో వీరు నిద్రమత్తులో ఉన్నపుడు ఎవరో పథకం ప్రకారం హత్య చేసిన ఉంటారని పోలీసులు ఆనుమానిస్తున్నారు.
చనిపోయిన ముగ్గురూ స్థానికులు కాకపోవడంతో అసలీ హత్యలు ఎందుకు జరిగాయనేది కనిపెట్టడం నిజామాబాద్ జిల్లా పోలీసులకు సవాలుగా మారింది. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో డిచ్ పల్లి పోలీసుల బృందం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నది. గతంలో సీరియల్ కిల్లర్ జావెద్ ముగ్గురిని చంపి ఉండటం, ఇప్పుడు ఒకే సారి ముగ్గురు హత్యకు గురికావడం జిల్లాలో కలకలం రేపింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.