Home /News /crime /

THREE LAKHS VALUABLES STOLEN BY CUTTING BAG OF FEMALE SI IN HISAR SSR

Female SI: ఈ మహిళా ఎస్‌ఐ బస్సులో వెళుతుంటే జర్నీలో దాహమేసి వాటర్ బాటిల్ కోసం బ్యాగ్ తీయగా..

ఎస్‌ఐ షామిమ్ రానా, బ్యాగ్ చూపుతున్న దృశ్యం

ఎస్‌ఐ షామిమ్ రానా, బ్యాగ్ చూపుతున్న దృశ్యం

మధ్యప్రదేశ్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు ప్రయాణించే బస్సుల్లో ప్రయాణికుల్లానే ఎక్కి మూడో కంటికి తెలియకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో ఎస్‌ఐగా పోస్టింగ్ తీసుకున్న ఓ మహిళా ఎస్‌ఐకి బస్సులో ప్రయాణిస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె బ్యాగ్‌ను మూడో కంటికి తెలియకుండా దొంగ కోసేశాడు.

ఇంకా చదవండి ...
    హిస్సార్: మధ్యప్రదేశ్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు ప్రయాణించే బస్సుల్లో ప్రయాణికుల్లానే ఎక్కి మూడో కంటికి తెలియకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో ఎస్‌ఐగా పోస్టింగ్ తీసుకున్న ఓ మహిళా ఎస్‌ఐకి బస్సులో ప్రయాణిస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె బ్యాగ్‌ను మూడో కంటికి తెలియకుండా దొంగ కోసేశాడు. బ్యాగ్‌లో ఉన్న మూడు లక్షల విలువైన నగలు, డబ్బును దోచుకెళ్లాడు. బ్యాగ్ కోసేసి దోచుకున్న దొంగ ఆ తర్వాత ఏమీ తెలియనట్టు బ్యాగ్ జిప్ వేసి వెళ్లిపోయాడు. దాహమేసి బ్యాగ్ జిప్ తీసి బాటిల్‌ను తీసుకునే క్రమంలో ఆ మహిళా ఎస్‌ఐకి దొంగతనం జరిగిన విషయం తెలిసింది. ఆమె వెనుక కూర్చున్న దొంగ సీటు కింద ఉంచిన బ్యాగును ఆమెకు తెలియకుండా కోసేసి.. అందినకాడిని దోచుకుని వెళ్లిపోయాడు.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎస్‌ఐ షామిమ్ రానా తన తల్లిదండ్రులను కలిసేందుకు హిస్సార్ నుంచి తొహనాకు వెళ్లేందుకు హర్యానా రాష్ట్రానికి చెందిన బస్సు ఎక్కారు. ఆమె తన వెంట ఓ బ్యాగ్ తెచ్చుకున్నారు. ఆ బ్యాగ్‌లో విలువైన నగలు, డబ్బు ఉన్నాయి. ఆ బ్యాగ్‌పై అప్పటికే ఆ బస్సులో ఉన్న ఓ దొంగ కన్ను పడింది. బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టంగా ఉంది. బ్యాగ్ కూడా సీటు కింద పెట్టి ఎస్‌ఐ ఓ కంట కనిపెడుతూనే ఉంది. బస్సు ఉదయం 11 గంటల సమయంలో బర్వాలా వద్దకు చేరుకోగానే వాటర్ బాటిల్ కోసం బ్యాగ్ జిప్ తీసి చూడగా.. బ్యాగ్ లోపల బ్లేడ్‌తో కోసేసినట్లు ఎస్‌ఐ గుర్తించింది.

    ఇది కూడా చదవండి: Painful Death: ఎంత లక్షణంగా ఉన్నావమ్మా.. నీకు ఇలాంటి చావు రాసి పెట్టి ఉందంటే అసలు ఏమనుకోవాలి..

    నెక్లెస్, 50 వేల డబ్బు, లాకెట్, మంగళసూత్రం, నాలుగు గోల్డ్ రింగ్స్, పోలీస్ ఐడీ కార్డు, బ్యాంకు ఏటీఎం మిస్సయినట్లు ఎస్‌ఐ తెలిపింది. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే షాకిచ్చిన ఆ దొంగ లేదా దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బర్వాలా పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. డబ్బు, బంగారంతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్లు కూడా మిస్సయినట్లు ఎస్ఐ షామిమ్ రానా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మన్సౌర్‌లో షామిమ్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Buses, Crime news, Theft

    తదుపరి వార్తలు