• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • THREE KILLED IN RAILWAY ENGINE CLASH IN VIKARAKAD DISTRICT AK

వికారాబాద్‌లో రైలు ఇంజిన్ ఢీకొని ముగ్గురు మృతి

రైలు ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి

వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మూసీ బ్రిడ్జిపై రైలు ఇంజిన్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.

  • Share this:
    వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మూసీ బ్రిడ్జిపై రైలు ఇంజిన్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. చనిపోయిన వారిని నవీన్, శంషీర్ అలీ, ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళుతున్న రైలు.. ప్రమాదవశాత్తు ముగ్గురిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జి దగ్గర 12 మంది సిబ్బంది పెయింటింగ్ వర్క్ చేస్తున్నటంటె తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు... వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు గురించి విచారణ చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published: