Home /News /crime /

THREE KILLED IN POND WATER IN BADRADRIKOTTAGUDEM DISTRICT BN

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముందు వినయ్ కుమార్ చెరువులో దిగి నీటిలో మునిగిపోయాడు. వెంటనే గమనించిన తేజేష్ అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నించే క్రమంలో ఇతడు జారిపడిపోయాడు.

    భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకరిని కాపాడపోయి.. మరొకరు.. ఇలా చెరువులో మునిగి చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు నల్లమోతు అప్పారావు(40) తన వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలు పండిస్తున్నాడు. ఈ క్రమంలో వాటికి రసాయన మందు కొట్టేందుకు తండ్రి క‌ృష్ణయ్య, కుమారుడు తేజేష్(21), మేనల్లుడు(చెల్లెలి కొడుకు) వినయ్ కుమార్(1)తో కలిసి పొలం వద్దకు వెళ్లారు. అందరూ కలిసి కూరగాయల తోటకు మందు పిచికారీ చేశారు. ఇంటికి వచ్చేందుకు కాళ్లు, చేతులు కడుక్కునేందుకు సమీపంలోని రేపాక చెరువు వద్దకు వెళ్లారు. ముందు వినయ్ కుమార్ చెరువులో దిగి నీటిలో మునిగిపోయాడు. వెంటనే గమనించిన తేజేష్ అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నించే క్రమంలో ఇతడు జారిపడిపోయాడు. వీరిద్దర్నీ కాపాడేందుకు ప్రయత్నించిన అప్పారావూ నీటిలో పడి మునిగిపోయాడు. వీరిని కాపాడేందుకు కృష్ణయ్య యత్నించే క్రమంలో అతడు నీటిలో పడిపోయాడు. అయితే కృష్ణయ్య మునిగిపోతుండగా, స్థానికులు పరుగున వచ్చి బయటకు లాగారు. చెరువులో లోతుగా గుంతలు ఉండడం, ఈత రాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Badradri, Crime news, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు