news18-telugu
Updated: November 15, 2020, 11:39 PM IST
ప్రతీకాత్మక చిత్రం
నిజామాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజు ముగ్గురు బాలికల ప్రాణం తీసింది. బాలికలు అలీ సాగర్ ప్రాజెక్టు వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను బోధన మండలం రాకాసిపేట్కు చెందిన జుబేరా, మెరాజ్, మషేర్గా గుర్తించారు. వివరాలు.. ఆదివారం పూట సరదాగా గడిపేందుకు ముగ్గురు బాలికలు అలీసాగర్ ప్రాజెక్టు చూసేందుకు వచ్చారు. బోటింగ్ చేద్దామని అనుకున్నారు. అయితే ప్రాజెక్టు సమీపంలో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో వారు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. వారు గాలింపు చేపట్టి.. ముగ్గురు బాలికల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో బాలికల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:
Sumanth Kanukula
First published:
November 15, 2020, 8:43 PM IST