2018లో గుజరాత్... అహ్మదాబాద్‌లో జరిగిందీ మోసం. తాల్టేజ్ ప్రాంతంలో... ఇద్దరు టూర్ ఆపరేటర్లు శక్తిసిన్హా వాఘేలా, అమిత్ పటేల్... కలిసి ట్రావెంట్ ఇండియా పేరుతో ఏజెన్సీ తెరిచారు. విదేశీ పర్యటనలకు వెళ్లేవారికి ప్యాకేజీలు, ఫ్లైట్ టికెట్స్, హోటళ్ల బుకింగ్ అన్నీ తామే చూసుకుంటామని పాంప్లెట్లు పంచిపెట్టారు. పేపర్లు, వెబ్సైట్లలో కూడా యాడ్స్ ఇచ్చారు. స్థానిక వ్యాపారి ఆకాష్ దావే (47), అతని ఫ్రెండ్ మావ్జీ దేశాయ్, దిలీప్ పటేల్... కలిసి... 2018 మాల్దీవులకు వెళ్లాలని అనుకున్నారు. ఓ ఫ్రెండ్ ద్వారా వాళ్లు... ట్రావెంట్ ఇండియా ఏజెన్సీ గురించి తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి... ప్యాకేజీ వివరాలు కనుక్కున్నారు. మొత్తం 4 పగళ్లు (డేస్), 5 రాత్రుళ్ల (నైట్స్)కు కలిపి... 14 మందికి... రూ.14.14... అవుతుందని ఆపరేటర్లు చెప్పారు. సరేనన్న ముగ్గురూ... అడ్వాన్స్‌గా రూ.7లక్షలకు సంబంధించి సెప్టెంబర్‌లో చెక్స్ ఇచ్చారు. నవంబర్‌లో టూర్‌కి వెళ్లాలని రెడీ అయ్యారు. అందుకు సంబంధించి... ఆపరేటర్లలో ఒకరి ఇంటికి వెళ్లి... మాల్దీవుల్లో బుక్ చేసుకున్న హోటళ్ల రిసీట్లు, ఫ్లైట్ టికెట్లు అడిగితే... ఆ ఆపరేటర్ అర్థం పర్థంలేని సమాధానాలు ఇచ్చాడు. డౌట్ రావడంతో... తమ డబ్బు వెనక్కి ఇచ్చేయాలని అడిగితే... ఏజెన్సీకి వచ్చి తీసుకోమని చెప్పాడు. తీరా ఏజెన్సీకి వెళ్తే... అది మూసేసి ఉంది.
ఆ తర్వాత... ఇద్దరు టూర్ ఆపరేటర్లూ ఫ్యామిలీలతో సహా కనిపించకుండా పోయారు. మోసపోయిన ముగ్గురు స్నేహితులూ... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఐతే... వాళ్లలాగే... మరో మూడు కేసులు కూడా పోలీస్ స్టేషన్లో రికార్డయ్యాయి. అన్ని కేసుల్లోనూ ఆ ఇద్దరు టూర్ ఆపరేటర్లే నిందితులు. వాళ్ల కోసం గాలిస్తున్నామన్న పోలీసులు... ఇంకా చాలా మందిని వాళ్లు మోసం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే... అడ్డంగా మోసపోయే ప్రమాదం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrest, Case, Crime, Love cheating, Police